Fake News, Telugu
 

‘స్విస్ బ్యాంక్ కార్పొరేషన్’ పేరిట చలామణి అవుతున్న డాక్యుమెంట్ నకిలీది

1

#స్విట్జర్లాండ్ బ్యాంకు లో డబ్బు దాచుకున్న #బడాబాబులు.. #రాజీవ్ గాంధీ, #హర్షద్ మెహతా, #చిదంబరం, #పలనిరాజు, #సురేష్ కల్మాడి, #శరద్ పవార్, #కరుణానిధి, #కేతన్ పరేఖ్, #చిరాగ్ జయేశ్ మోహిని, #కళానిధిమారన్’ అంటూ వారి పేర్లతో ఉన్న ఒక ‘స్విస్ బ్యాంక్ కార్పొరేషన్’ డాక్యుమెంట్ని చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ డాక్యుమెంట్ ఎంతవరకు వాస్తవమైనదో చూద్దాం.      

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : ‘స్విస్ బ్యాంక్ కార్పొరేషన్’ వారు రాజీవ్ గాంధీ, హర్షద్ మెహతా, చిదంబరం, పలనిరాజు, సురేష్ కల్మాడి, శరద్ పవార్, కరుణానిధి, కేతన్ పరేఖ్, చిరాగ్ జయేశ్ మోహిని, కళానిధిమారన్ లను బ్లాక్ లిస్ట్ చేసినట్లుగా 2011లో భారత ప్రభుత్వానికి ఒక డాక్యుమెంట్ పంపింది.

ఫాక్ట్ (నిజం): ‘స్విస్ బ్యాంక్ కార్పొరేషన్’ 1998 లోనే ‘యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్’ లో విలీనమై ‘యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ ఏజీ’ గా ఏర్పడింది. కానీ, పోస్టు లో ఉన్న డాక్యుమెంట్ 31 అక్టోబర్ 2011 తేదీతో ఉంది. ఆ డాక్యుమెంట్ కూడా ఒక అధికారికమైన పద్ధతిలో లేదు మరియు అందులో చాలా వ్యాకరణ పరమైన తప్పులున్నాయి. కావున, పోస్టులో చేసిన ఆరోపణ తప్పు.  

‘స్విస్ బ్యాంక్ కార్పొరేషన్’ వారు ఆ డాక్యుమెంట్ విడుదల చేశారా అని వెతికినప్పుడు, ‘బ్రిటానికా’ వారి కథనం ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో లభించింది. దాని ప్రకారం స్విస్ బ్యాంక్ కార్పొరేషన్’ 1998 లోనే ‘యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్’ లో విలీనమై ‘యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ ఏజీ’ గా ఏర్పడ్డాయి అని తెలిసింది. కానీ, పోస్టు లో పెట్టిన డాక్యుమెంట్ 31 అక్టోబర్ 2011 తేదీతో ‘స్విస్ బ్యాంక్ కార్పొరేషన్’ పేరిట ఉంది. మరియు ఆ పత్రంలో బ్యాంక్ మేనేజర్ గా ‘మార్టిన్ డి సాపింటో’ అనే పేరు ఉంది. అదే పేరుతో గూగుల్ లో సెర్చ్ చేసినప్పుడు, చాలా రిజల్ట్స్ అతనిని ఒక ‘రాయిటర్స్’ సంస్థ జర్నలిస్ట్ గా పేర్కొంటూ వచ్చాయి, కానీ ఆ పేరుతో ‘స్విస్ బ్యాంక్ కార్పొరేషన్’ మేనేజర్ ఉన్నట్లుగా ఎక్కడ ఎటువంటి సమాచారం లేదు. వీటిని బట్టి ఆ డాక్యుమెంట్ నకిలీది అని చెప్పవొచ్చు.

‘స్విస్ బ్యాంక్ కార్పొరేషన్’ డాక్యుమెంట్ నకిలీది అని చెప్పడానికి మరికొన్ని కారణాలు:

  1. ఆ పత్రాన్ని చెక్ చేసినప్పుడు ‘గవర్నమెంట్ అఫ్ ఇండియా’ కి బదులుగా ‘ఇండియన్ గవర్నమెంట్’ అని ఉంది.
  2. విదేశీ బ్యాంకులు చాలా వరకు అకౌంట్లలో ఉన్న నిలువలను ‘యూఎస్ డాలర్స్ లేదా ‘యూరోస్’ లలో పేర్కొంటారు. కానీ, ఆ పత్రంలో ‘రూపాయలలో’ పేర్కొన్నారు.
  3. ఆ పత్రంలో స్విట్జర్లాండ్ కంట్రీ కోడ్ ‘0044’ అని ఉంది. అది ‘యూనైటెడ్ కింగ్డమ్’ కోడ్. స్విట్జర్లాండ్ కంట్రీ కోడ్ ‘0041’.

అవి మాత్రమే కాకుండా, ఆ డాక్యుమెంట్ లో ఇంకా చాలా వ్యాకరణ పరమైన తప్పులు కూడా ఉన్నాయి. 

చివరగా, ‘స్విస్ బ్యాంక్ కార్పొరేషన్’ పేరిట చలామణి అవుతున్న డాక్యుమెంట్ నకిలీది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll