Fake News, Telugu
 

ఫోటోలలో చూపించిన శిల్పాలు వాటికి సంబంధించిన కాథెడ్రల్స్, ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా చెక్కబడినవి

1

తమిళనాడు లోని 2000 సంవత్సరాల పురాతనమైన పంచవర్ణస్వామి ఆలయం గోడల మీద చెక్కిన శిల్పాలు అని క్లెయిమ్ చేస్తూ  కొన్ని ఫోటోలు –– ‘ఒక సైకిల్, ఒక వ్యోమగామి, మరియు రిమోట్’ –– సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కాబడుతున్నాయి. ఆ క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో కనుక్కుందాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్  వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2000 సంవత్సరాల క్రితం పంచవర్ణ స్వామి ఆలయపు గోడల మీద చెక్కబడిన ఒక సైకిల్, ఒక వ్యోమగామి మరియు రిమోట్ ఫోటోలు.

ఫాక్ట్ (నిజం): ఆ ఫొటోల్లో ఒక్కటి తప్పితే, మిగితావి ఏవీ పంచవర్ణ స్వామి ఆలయానికి సంబంధించిన ఫోటోలు కావు. సైకిల్ శిల్పాన్ని పంచవర్ణ స్వామి ఆలయం లో 20వ శతాబ్దంలో చెక్కారు. ఇతర శిల్పాలని కూడా వాటికీ సంబంధించిన ఆవిష్కరణలు జరిగిన తరువాతనే కాథెడ్రల్స్ మీద చెక్కారు. కావున, పోస్ట్ లోని క్లెయిమ్ తప్పు

ఫోటో 1:

ఈ ఫోటోని  గూగుల్ రివర్స్ ఇమేజ్ టెక్నిక్ ద్వారా వెతికితే ఇలాంటి ఫోటోనే  ‘Trip Advisor’ వెబ్సైటులో కనిపించింది, ఆ వెబ్సైటు వారు ఫోటో మీద రాసిన శీర్షిక ప్రకారం అది  బాలి లోని ఒక ఆలయంలో చెక్కబడిన శిల్పం  అని తెలిసింది. ఆ ఫోటో గురించిన వివరాలకై మరింత వెతికితే అదే ఫోటో ఎన్నో  స్టాక్ వెబ్సైట్స్ లలో కూడా కనిపించింది. ఆ ఫోటో ‘Adobe Stock’ వెబ్సైటు లో కూడా ఉంది, అందులో ఆ ఫోటో గురించి రాసిన దాని ప్రకారం అది కుబుతాంబహన్ లోని పురా మాడువె  కరాంగ్ అనే గుడి లో చెక్కిన ఒక సైకిల్ నడుపుతున్న వ్యక్తి శిల్పం అని అర్ధం అవుతుంది. ఆ గుడి మరియు ఆ శిల్పం గురించిన  మరిన్ని వివరాలను ఇక్కడ చూడవచ్చు. దీని బట్టి, ఆ ఫోటో ఇండోనేషియా లోని ఒక గుడి కి సంబంధించిన ఫోటో అని తెలుస్తుంది.

ఫోటో 2:

ఈ ఫోటో ని గూగుల్ రివర్స్ ఇమేజ్ టెక్నిక్ ద్వారా వెతికితే అది స్పెయిన్ లోని ఒక కాథెడ్రల్ కి సంబంధించిన  శిల్పం అని సెర్చ్ రిజల్ట్స్ ద్వారా తెలిసింది.

గూగుల్ లో దీనికి  సంబంధించిన కీ వర్డ్స్ ఉపయోగించి వెతికితే ‘The Vintage News’ రాసిన ఒక ఆర్టికల్ కనిపించింది. ఆ ఆర్టికల్ ప్రకారం, ఆ శిల్పాన్ని  సాలమంకా కాథెడ్రల్ కి 1992లో జరిగిన పునర్నిర్మాణంలో దాని ముందు భాగంలో  చెక్కారు అని తెలిసింది. అదే విషయాన్నీ ‘Times Travel’ ఆర్టికల్ లో కూడా చూడవచ్చు. కావున, ఫొటోలోని శిల్పం భారత దేశం లోని ఏ గుడికి సంబంధించినది కాదు.

ఫోటో 3: 

ఈ ఫోటో ని గూగుల్ రివర్స్ ఇమేజ్ టెక్నిక్ ద్వారా వెతికితే వేరే ఆంగిల్ లో తీసిన ఇలాంటి ఫోటోనే ‘Wikiversity’ వైబ్సైట్ లో కనిపించింది, అందులో ఉన్న సమాచారం ప్రకారం ఇది స్పెయిన్ లోని కలహోర్రా కాథెడ్రల్ కి సంబంధించినదిగా తెలిసింది.

ఒక స్పానిష్ వైబ్సైట్ లో ఆ ఫోన్ యొక్క శిల్పాన్ని 1996 లో కలహోర్రా కాథెడ్రల్ లో జరిగిన పునరుద్దరణ కార్యక్రమం లో చెక్కారని తెలిసింది. అదే విషయాన్నీ ‘InfoLibre’ వారి వైబ్సైట్ లో కూడా చూడవచ్చు.

ఫోటో 4:

ఈ ఫోటో కి సంబంధించిన వివరాలకై గూగుల్ రివర్స్ ఇమేజ్ ద్వారా వెతికితే, ఇది 2018 లో పంచవర్ణ స్వామి గుడి గురించి అప్లోడ్ చేసిన ఒక యూట్యూబ్ వీడియో నుంచి తీసుకోబడింది అని తెలిసింది. దీని బట్టి, ఆ ఫోటోలోని శిల్పం పంచవర్ణ స్వామి ఆలయంకి సంబంధించిందే అని అర్ధం అవుతుంది. కానీ, ఆ శిల్పం 2000 సంవత్సరాల క్రితమే  చెక్కబడ్డదా లేదా అనేది కింద చూద్దాం.

ఆ శిల్పం గురించి ‘The Hindu‘ దిన పత్రికతో  Dr. కళైకోవన్ మాట్లాడుతూ ఆ ప్రాచీన ఆలయంలో ఆ సైకిల్ శిల్పం చెక్కి ఉండడం తనకు ఆశ్చర్యంగాఅనిపించింది అని, ఆ శిల్పం గురించి అక్కడ ఉన్న అధికారులు గానీ, ఆ ఆలయ చరిత్ర రాసిన వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోయారని తెలిపాడు. ఆ శిల్పాన్ని చెక్కిన అతను ఎవరినైనా సైకిల్ మీద చూసి, అది నచ్చి, దాన్ని ఆ ఆలయం మీద చెక్కి ఉండొచ్చు అని అన్నాడు. Dr. కళైకోవన్ థియరీ  ప్రకారం 1920లో సైకిల్ అనేది తిరుచ్చిలో కొత్తగా వచ్చి ఉండవచ్చని, ఆలయాన్ని పునర్నిర్మించేటప్పుడు ఆ సైకిల్ శిల్పాన్ని  ఆలయం మీద చెక్కి ఉంటారని పేర్కొన్నాడు. కావున, ఆ సైకిల్ శిల్పాన్ని  చెక్కినది ఆలయం మొదలు పెట్టిన  5వ శతాబ్ధంలో కాదు, దాన్ని 20వ శతాబ్ధంలో చెక్కారు. ఇదే ఫోటో 2018 లో వైరల్ అయినప్పుడు, దాని గురించి ఫాక్ట్స్ తెలుపుతూ ‘Snopes’ రాసిన ఆర్టికల్ ని చూడవచ్చు.

చివరగా, ఆ ఫోటోల్లో ఉన్న శిల్పాలు అన్నీ, వాటికి  సంబంధించిన ఆలయం మీద, కాథెడ్రల్స్ మీద పునర్నిర్మాణం జరిగేటప్పుడు అదనంగా చెక్కబడినవే కానీ పంచవర్ణస్వామి ఆలయం మీద 2000 సంవత్సరాల క్రితం చెక్కబడిన కట్టడాలు కాదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll