Fake News, Telugu
 

ఫోటోకి వచ్చిన లైక్లు, షేర్లని బట్టి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఫేస్బుక్ డబ్బులు ఇవ్వదు

0

పోస్టుల్లో పెట్టిన అనారోగ్య పిల్లల ఫోటోలను లైక్ లేదా షేర్ చేస్తే, ఫేస్బుక్ డబ్బులు ఇస్తుంది అని చెప్తూ ఫేస్బుక్ లో చాలా మంది వివిధ పోస్టులను (పోస్ట్ 1, పోస్ట్ 2) షేర్ చేస్తున్నారు. ఆ పోస్టుల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఫోటోని లైక్ లేదా షేర్ చేస్తే ఫేస్బుక్ వారికి డబ్బులు ఇస్తుంది.

ఫాక్ట్ (నిజం): ఫోటోని లైక్ లేదా షేర్ చేస్తే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఫేస్బుక్ డబ్బులు ఇవ్వదు. ఫేస్బుక్ లో దేనికైనా ఫండ్స్ కలెక్ట్ చేయాలంటే దానికి వేరే ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి. అంతేకానీ, ఫోటోకి వచ్చిన లైక్లు మరియు షేర్లు బట్టి డబ్బులు రావు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు. 

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో వెతకగా, ఫోటోకి వచ్చే లైక్లు మరియు షేర్లని బట్టి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఫేస్బుక్ డబ్బులు ఇస్తుందని ఎప్పటినుంచో ప్రచారం అవుతుందని చూడవొచ్చు. 2017 లో ఈ విషయం పై ‘CBS’ వార్తాసంస్థ ప్రచురించిన ఆర్టికల్ లో ఇలాంటి పోస్టులను “Dangerous ‘like-farming’ scam” అని పేర్కొన్నట్టు చూడవొచ్చు.

ఫోటోకి వచ్చే లైక్లు మరియు షేర్లని బట్టి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఫేస్బుక్ డబ్బులు ఇస్తుందా అని వెతకగా, తాము అలా డబ్బులు ఇవ్వమని ఫేస్బుక్ టీం వారు ‘ఫేస్బుక్ హెల్ప్’ సెక్షన్ లో ఈ విషయం పై ఇచ్చిన సమాధానం దొరుకుతుంది. ఈ విషయం పై మరో సమాధానం ఇక్కడ చూడవొచ్చు. FACTLY కూడా ఫేస్బుక్ వారిని సంప్రదించింది, వారి నుండి సమాధానం వాచ్చక ఈ ఆర్టికల్ అప్డేట్ చేయబడుతుంది.

ఫేస్బుక్ లో దేనికైనా ఫండ్స్ కలెక్ట్ చేయాలంటే దానికి వేరే ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి. ‘Facebook Social Good’ లో భాగంగా ‘Donate’ బటన్ సహాయంతో వివిధ కారణాల కోసం ఫేస్బుక్ ద్వారా ఫండ్స్ కలెక్ట్ చేయొచ్చు. కానీ, ఫేస్బుక్ మాత్రం లైక్లు మరియు షేర్లని బట్టి డబ్బులు ఇవ్వదు. 

చివరగా, ఫోటోకి వచ్చిన లైక్లు మరియు షేర్లు బట్టి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఫేస్బుక్ డబ్బులు ఇవ్వదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll