Fake News, Telugu
 

‘స్త్రీ స్వాభిమాన్’ పథకం ద్వారా అందరికీ 12,000 రూపాయలు రావు. కానీ, సానిటరీ పాడ్స్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు సహాయం పొందవొచ్చు.

1

‘స్త్రీ స్వాభిమాన్’ పథకం ద్వారా ఆధార్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరి ఖాతాలోకి 12,000 రూపాయలు వస్తాయి అని చెప్తూ ఒక వీడియో లింక్ తో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘స్త్రీ స్వాభిమాన్’ పథకం ద్వారా ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ 12,000 రూపాయలు వస్తాయి.

ఫాక్ట్ (నిజం): ఈ పథకం కింద సానిటరీ పాడ్స్ ఉత్పత్తి కేంద్రాలు పెట్టే వాళ్ళకు, ప్రభుత్వం కొంత సహాయం చేస్తుంది. అంతేకానీ, వీడియోలో చెప్పినట్టు ఆధార్ కార్డు ఉండి, రిజిస్టర్ చేసుకున్న అందరికీ 12,000 రూపాయలు ఇవ్వదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు. 

పోస్ట్ లోని వీడియో లింక్ ఓపెన్ చేసి చూడగా, ‘స్త్రీ స్వాభిమాన్’ పథకం ద్వారా ప్రతి ఒక్కరికీ 12,000 రూపాయలు వస్తాయని వీడియోలో ఉంటుంది. కావున, ‘స్త్రీ స్వాభిమాన్’ పథకం గురించి గూగుల్ లో వెతకగా, ‘స్త్రీ స్వాభిమాన్’ యొక్క వెబ్ సైట్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ వెబ్ సైట్ లో ‘స్త్రీ స్వాభిమాన్’ పథకం గురించి వివరాలు చూడగా, మహిళలకు అర్యోగ్య రక్షణ మరియు పర్యావరణ పరిరక్షణ కోసం తక్కువ ధరకే బయో-డీగ్రేడబల్ సానిటరీ పాడ్స్ ఉత్పత్తి చేయడానికి కేంద్ర ఐటీ శాఖ (MeitY) మొదలు పెట్టిన పథకం అని తెలుస్తుంది. దేశంలోని కామన్ సర్వీసెస్ సెంటర్ల సహాయంతో సానిటరీ పాడ్స్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చదవొచ్చు .

ఈ పథకం కింద సానిటరీ పాడ్స్ ఉత్పత్తి కేంద్రాలు పెట్టే వాళ్ళకు ప్రభుత్వం కొంత సహాయం చేస్తుంది. అంతేకానీ, వీడియోలో చెప్పినట్టు ఆధార్ కార్డు ఉండి, రిజిస్టర్ చేసుకున్న అందరికీ 12,000 రూపాయలు ఇవ్వదు. ఈ పథకం పై లోక్ సభ లో ప్రశ్న అడగగా, ఈ పథకం గురించి వివరిస్తూ, మంత్రి అహ్లువాలియా ఇచ్చిన సమాధానాన్ని కింద చదవొచ్చు. దాంట్లో కూడా వీడియోలో చెప్పిన 12,000 రూపాయల గురించి ఎక్కడా కూడా మంత్రి ప్రస్తావించలేదు.

కామన్ సర్వీసెస్ సెంటర్లు ఈ పథకం ద్వారా ఎటువంటి సహాయం చేస్తాయో ‘స్త్రీ స్వాభిమాన్’ వెబ్ సైట్ లో చూడవొచ్చు

చివరగా, ‘స్త్రీ స్వాభిమాన్’ పథకం ద్వారా అందరికీ 12,000 రూపాయలు రావు. కానీ, సానిటరీ పాడ్స్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు సహాయం పొందవొచ్చు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll