Fake News, Telugu
 

‘లిఫ్ట్ లో 71 గంటలు.. ఆకలేసి భార్యను తినేసిన భర్త…’ అనే వార్త ఒక ఫేక్ న్యూస్

0

‘Asianet News’ వార్తా సంస్థ తమ ఫేస్బుక్ పేజీ లో ‘భార్యను చంపి .. మాంసం తిని… రక్తం తాగేశాడు…’ అని పోస్టు చేసి, అందుకు సంబంధించిన ఆర్టికల్ లింక్ ని పెట్టారు. ఆ వార్త ఎంతవరకు వాస్తవమో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: లిఫ్ట్ లో 71 గంటలు ఇరుక్కుపోయినందున బ్రతకడానికి భార్యను చంపేసి తినేసిన భర్త.

ఫాక్ట్ (నిజం): ఆ వార్తను మొట్టమొదటిసారిగా ప్రచురించింది అమెరికాకి చెందిన “World News Daily Report” అనే ఒక ‘వ్యంగ్యపు’ వార్తలు రాసే వెబ్సైట్. కావున, పోస్ట్ లో పెట్టిన కథనం లో చెప్పిన విషయం వాస్తవ ఘటనకి సంబంధించినది కాదు, అందులో పేర్కొన్నది తప్పు.

పోస్ట్ లో పెట్టిన ‘Asianet News’ వారి వార్తా కథనం(ఆర్కైవ్డ్) లో, ఫిలడెల్పియా లో ఇద్దరు భార్యభర్తలు అనుకోకుండా లిఫ్ట్ లో 71 గంటలు ఇరుక్కుపోయారనీ, అప్పుడు భర్త తనను తాను బతికించుకోవడానికి కట్టుకున్న భార్యను చంపేసి ఆమె మాంసం తిన్నాడని ఉంది. ఆ కథనం లో పేర్కొన్న విషయం గురించి సమాచారం కోసం గూగుల్ లో ‘Philadelphia couple struck in lift, man eats his wife to survive’ అని వెతికినప్పుడు, అందుకు సంబంధించిన చాలా సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. వాటిలో,  “World News Daily Report(WNDR)” అనే ఒక వెబ్సైట్ అటువంటి వార్త ని మొట్టమొదట ప్రచురించినట్లుగా తెలిసింది.

ఆ వెబ్సైటు యొక్క ‘About us’ విభాగం లో ఒక డిస్క్లైమర్ ఉంది. అందులో, WNDR అనేది ఒక ‘సెటైరికల్’ వెబ్సైట్ అనీ, వారి కథనాలు ‘ఫిక్షన్’ ఆధారంగా ఉంటాయనీ ఉంది. కావున,  ఆ కథనంలో ఉన్నది వాస్తవ ఘటనకి సంబంధించినది కాదు. కానీ, ‘Asianet News’ వారు ‘WNDR’ ప్రచురించిన ఆ కథనాన్ని ఆధారంగా చేసుకుని వార్తని ప్రచురించారు.

గతంలో ‘WNDR’ వారి వేరే కథనం ఆధారంగా, ఒక మహిళ ఒకే కాన్పులో 17 మంది చిన్నారులకు జన్మనిచ్చిందంటూ వార్తలు వచ్చినప్పుడు, FACTLY వారు రాసిన కథనం ఇక్కడ చూడవచ్చు. 

ప్రస్తుత పోస్ట్ ఫేక్ అని గతంలోనే స్నోప్స్ సంస్థ రాసిన ఫాక్ట్ చెక్ ఇక్కడ చూడొచ్చు.

చివరగా, ‘లిఫ్ట్ లో 71 గంటలు.. ఆకలేసి భార్యను తినేసిన భర్త…’ అనే వార్త వాస్తవానికి ఒక ఫేక్ న్యూస్.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll