Fake News, Telugu
 

Childeal.in వెబ్ సైట్ ద్వారా ఆనందయ్య మందును బుక్ చేసుకునేలా ప్రభుత్వం ఎటువంటి ఏర్పాటు చేయలేదు

0

Childeal.in అనే వెబ్ సైట్ ద్వారా ఆనందయ్య మందును బుక్ చేసుకునేలా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా బాగా షేర్ చేస్తున్నారు. ఆనందయ్య కరోనా మందుకు ప్రభుత్వం ఈ మధ్య అనుమతి ఇవ్వడంతో ఈ విషయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: childeal.in వెబ్ సైట్ ద్వారా ఆనందయ్య మందును బుక్ చేసుకునేలా ప్రభుత్వం ఏర్పాటు.

ఫాక్ట్: Childeal.in అనే వెబ్ సైట్ ఓపెన్ చేయటానికి ప్రయత్నించినప్పుడు ఇది ఒక స్పామ్ వెబ్ సైట్ అని తెలుస్తుంది. ఎందుకంటే అందులో ఆనందయ్య మందుకు సంబంధించి ఎటువంటి సమాచారం లభించలేదు. దానితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఫాక్ట్ చెక్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆనందయ్య మందు పంపిణికి సంబంధించి వైరల్ అవుతన్న వెబ్ సైట్ ఫేక్ అని స్పష్టం చేసారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

ఆనందయ్య మందు పంపిణికి సంభందించి న్యూస్ ఆర్టికల్స్ గురించి వెతికినప్పుడు రెండు న్యూస్ ఆర్టికల్స్ లభించాయి. ఒక న్యూస్ ఆర్టికల్ లో ఆనందయ్య కరోనా మందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పంపిణి విధానంపై నెల్లూరు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులు సమావేశం నిర్వహించారని, ఆనందయ్య మందులను వీలైనంత త్వరలో ఆన్ లైన్ ద్వారా పంపణీ ప్రారంభిస్తామని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు వెల్లడించారని తెలుస్తుంది. మరొక న్యూస్ ఆర్టికల్ లో ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపధ్యంలో 07 జూన్ 2021 తేదీ నుంచి ఆయుర్వేద మందు పంపిణికి అవసరమైన సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ఈ రెండు న్యూస్ ఆర్టికల్స్ లో ఏ వెబ్ సైట్ ద్వారా పంపిణి చేస్తారో తెలుపలేదు.    

కానీ పలు ఇతర వార్తా సంస్థలు – TV9 తెలుగు (ఆర్కైవ్), NTV తెలుగు (ఆర్కైవ్), Zee Hindustan తెలుగు (ఆర్కైవ్), Telangana Today (ఆర్కైవ్) ఆనంద‌య్య మందు కోసం ‘childeal.in’ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని, ఆ వెబ్‌సైట్ పేరును నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం ప్ర‌క‌టించిందని తమ ఆర్టికల్స్ లో పేర్కొన్నారు.

childeal.in అనే వెబ్ సైట్ ఓపెన్ చేయటానికి ప్రయత్నించినప్పుడు, ఇది ఒక స్పామ్ వెబ్ సైట్ అని తెలుస్తుంది. ఎందుకంటే అందులో ఆనందయ్య మందుకు సంబంధించి ఎటువంటి సమాచారం లభించలేదు. దానితో పాటు ఆ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం వేరే వెబ్ సైట్ కి డైరెక్ట్ అవుతుంది.

తెలంగాణా పోలీస్ సైబర్ క్రైమ్ డిపార్టుమెంటు వారు తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆనందయ్య మందు పంపిణి కి సంభందించిన ఆ వెబ్ సైట్ ఫేక్ అని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఫాక్ట్ చెక్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆనందయ్య మందు పంపిణికి సంభందించి వైరల్ అవుతన్న వెబ్ సైట్ నిజం కాదని, అటువంటి అధికారిక వెబ్ సైట్ అసలు లేదని మరియు మరే ఇతర వెబ్ సైట్ కి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఒక వేళ అటువంటి వెబ్ సైట్ ఏదయినా ఉంటె ఆరోగ్య శాఖ దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తారని కూడా స్పష్టం చేసారు. ఇదే సమాచారాన్ని తెలుపుతూ ‘NEWS18 తెలుగు’ ప్రచురించిన కథనాన్ని ఇక్కడ చదవొచ్చు.

చివరగా, Childeal.in వెబ్ సైట్ ద్వారా ఆనందయ్య మందును బుక్ చేసుకునేలా ప్రభుత్వం ఇంకా ఎటువంటి ఏర్పాటు చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll