Fake News, Telugu
 

ఢిల్లీలో నిక్కీ యాదవ్‌ను హత్య చేసిన ‘సాహిల్ గెహ్లాత్’ ముస్లిం మతస్థుడు కాదు

0

ఇటీవల ఢిల్లీలో ఒక వ్యక్తి తన ప్రియురాలిని చంపి శవాన్ని  ఫ్రిడ్జ్‌లో దాచిన ఘటన వెలుగులోకి వచ్చిన నేపధ్యంలో, అతను ముస్లిం మతానికి చెందిన వ్యక్తని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఇటీవల ఢిల్లీలో తన ప్రియురాలిని చంపి శవాన్ని ఫ్రిడ్జ్‌లో దాచిన వ్యక్తి సాహిల్ ముస్లిం మతానికి చెందినవాడు.

ఫాక్ట్: ఈ హత్య చేసిన నేరస్థుడి పేరు ‘సాహిల్ గెహ్లాత్’. ఇతను ఒక హిందువు. ముస్లిం మతస్థుడు కాదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

మీడియా మరియు పోలీసుల కథనాల ప్రకారం, నేరస్థుడి పూర్తి పేరు సాహిల్ గెహ్లాత్ (24). ఇతను ఒక హిందువు. తనతో సహజీవనం చేస్తున్న నిక్కీ యాదవ్‌ను  సాహిల్ 10 ఫిబ్రవరి 2023న చంపి తన డాబాలోని ఫ్రిడ్జ్‌లో శవాన్ని దాచాడు. అతనికి ఇదివరకే పెళ్లి నిశ్చయమైన విషయం ఆ మహిళకు తెలియడంతో, ఇద్దరి మధ్య గొడవ జరిగి, సాహిల్ నిక్కీని ఫోన్ కేబుల్‌తో హతమార్చాడు.

నిక్కీని చంపిన రోజే సాహిల్ గెహ్లాత్ మరొక మహిళని హిందూ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. సంబంధిత కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, ఇటీవల ఢిల్లీలో నిక్కీ యాదవ్ అనే మహిళ ని చంపిన సాహిల్ గెహ్లాత్ ముస్లిం మతస్థుడు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll