Fake News, Telugu
 

సంబంధం లేని పాత వీడియోని ఈశాన్య తీర రాష్ట్రాలలో ‘యాస్’ తుఫాను సృష్టిస్తున్న బీభత్సం దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

‘యాస్’ తుఫాను ఉహకందని గాలివేగంతో ప్రయాణిస్తూ పెద్ద చెట్లని సైతం దూదిపింజల్లా ఎగరగొడుతున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా ఇటీవల ఏర్పడిన ‘యాస్’ తుఫాను, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో తీవ్ర బీభత్సం సృష్టించింది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘యాస్’ తుఫాను ఉహకందని గాలివేగంతో ప్రయాణిస్తూ పెద్ద చెట్లని సైతం దూదిపింజల్లా ఎగరగొడుతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది. ఈ వీడియో 2016లో ఉరుగ్వే దేశంలో చోటుచేసుకున్న తీవ్ర తుఫాను యొక్క దృశ్యాలని చూపిస్తుంది. ఈ వీడియోకి ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన ‘యాస్’ తుఫానుకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ఒక యూట్యూబ్ యూసర్ 2016లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. 2016లో ఉరుగ్వే దేశంలోని డోలొరెస్ నగరంలో చోటుచేసుకున్న తీవ్ర తుఫాను యొక్క దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు.

ఈ వీడియోలో కనిపిస్తున్న భవనం పై ‘BBVA’ అని రాసి ఉండటాన్ని మనం గమనించవచ్చు. BBVA అనేది స్పెయిన్ కి సంబంధించిన బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ కంపెనీ అని తెలిసింది. ఉరుగ్వే దేశంలోని డోలొరెస్ నగరంలో స్థాపించిన BBVA బ్యాంకు బ్రాంచ్ యొక్క దృశ్యాలు మాకు గూగుల్ స్ట్రీట్ వ్యూ లో లభించాయి. గూగుల్ లో లభించిన BBVA బ్యాంకు దృశ్యాలు, వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలతో మ్యాచ్ అవ్వడంతో, ఈ వీడియో ఉరుగ్వే దేశానికి సంబంధించిన పాత వీడియో అని స్పష్టమయ్యింది.

డోలొరెస్ నగరంలో 2016లో చోటుచేసుకున్న ఈ తీవ్ర తుఫానుకు సంబంధించిన మరొక వీడియోని ఒక యూసర్ తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసారు. 15 ఏప్రిల్ 2016 నాడు డోలొరెస్ నగరంలో తీవ్రమైన గాలులు వీస్తూ భారీ తుఫాను ఏర్పడినట్టు ఆ వీడియో వివరణలో తెలిపారు. డోలొరెస్ నగరంలో చోటుచేసుకున్న ఈ తుఫానుకు సంబంధించి ‘CNN’ న్యూస్ సంస్థ 16 ఏప్రిల్ 2016 నాడు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన ‘యాస్’ తుఫానుకి సంబంధించింది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, సంబంధం లేని పాత వీడియోని షేర్ చేస్తూ ఈశాన్య తీర రాష్ట్రాలలో ‘యాస్’ తుఫాను సృష్టిస్తున్న బీభత్సం యొక్క దృశ్యాలంటున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll