Fake News, Telugu
 

క్రిస్టియన్ మిషనరీలు దేశంలో మత మార్పిడులు చేస్తున్నాయని RSS సభ్యుడు ‘జెరోమ్’ చేసిన ఆరోపణలను వక్రీకరించి షేర్ చేస్తున్నారు

0

“భారతదేశంలో ప్రధానమంత్రితో సహా రోజుకు 14వేల హిందువులను క్రైస్తవులుగా మత మార్పిడి చేయాలని నిర్ణయించాం” అని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: భారతదేశంలో ప్రధానమంత్రితో సహా రోజుకు 14వేల హిందువులను క్రైస్తవులుగా మత మార్పిడి చేయాలని నిర్ణయించినట్లు ‘జెరోమ్ ఆంటో’  అనే వ్యక్తి చెప్తున్న వీడియో.

ఫాక్ట్: ఇంటర్వ్యూలో మాట్లాడే ‘జెరోమ్ ఆంటో’ అనే వ్యక్తి మత మార్పిడులకు వ్యతిరేఖంగా పోరాడే యాక్టివిస్ట్, ఆర్ఎస్ఎస్ సభ్యుడు కూడా. ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతదేశంలో వివిధ క్రిస్టియన్ మిషనరీలు భారతీయులని మత మార్పిడి చేయడానికి అనేక  ప్రణాళికలు వేస్తున్నట్లు మరియు ప్రధానమంత్రితో సహా రోజుకు 14వేల హిందువులను క్రైస్తవులుగా మత మార్పిడి చేయాలని వారు నిర్ణయించినట్లు ఆయన ఆరోపించారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి పేరు ‘జెరోమ్ ఆంటో’. తాను ఆర్ఎస్ఎస్ సభ్యుడినని అనేక సందర్భాలలో ప్రకటించుకున్నాడు. మత మార్పిడులకు వ్యతిరేఖంగా పోరాడే యాక్టివిస్ట్, కూడా. ఇక వైరల్ వీడియో క్లిప్‌ “Law street Bharat” అనే యూట్యూబ్ ఛానెల్‌కు ‘జెరోమ్ ఆంటో’ ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో మాత్రమే. పూర్తి ఇంటర్వ్యూని ఇక్కడ చూడవచ్చు. ఈ ఇంటర్వ్యూలో భారతదేశంలో వివిధ క్రిస్టియన్ మిషనరీలు భారతీయులని మత మార్పిడి చేయడానికి అనేక  ప్రణాళికలు వేస్తున్నాయని ఆయన చెప్పారు. అలాగే ప్రధానమంత్రితో సహా రోజుకు 14వేల హిందువులను క్రైస్తవులుగా మత మార్పిడి చేయాలని క్రిస్టియన్ మిషనరీలు నిర్ణయించినట్లు జెరోమ్ ఆరోపించారు.

చివరిగా, క్రిస్టియన్ మిషనరీల పైన జెరోమ్ చేసిన మత మార్పిడి ఆరోపణలను వక్రీకరించి షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll