Fake News, Telugu
 

దీపికా పదుకొనె టిషర్టు పై రైతులకు అండగా నిలబడతాను అనే స్లోగన్ ఫోటోషాప్ చేయబడినది

0

బాలీవుడ్ నటి దీపికా పదుకొనె వివాదాస్పదమైన పద్మావతి సినిమాలో నటించి, JNU లో దాడికి గురైన లెఫ్ట్ వింగ్ విద్యార్ధులకు సంఘీభావం తెలిపి, ఇప్పుడు రైతులకి కూడా మద్దుతు తెలుపుతుంటే ఆమె పై డ్రగ్స్ కేసు కాదు బ్రోతేల్ ఆరోపణులు వచ్చిన ఆశ్చర్య పోనక్కర్లేదు, అంటూ షేర్ చేస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో దీపికా పదుకొనె ధరించిన టి-షర్ట్ పై ‘I STAND WITH INDIAN FARMERS’ అనే స్లోగన్ ఉండటం మనం చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రైతులకు అండగా నిలబడతాను అనే స్లోగన్ ఉన్న టి-షర్టుని ధరించిన దీపికా పదుకొనె.

ఫాక్ట్ (నిజం): ఫోటోలో దీపికా పదుకొనె ధరించిన టి-షర్ట్ పై రైతులకు అండగా నిలబడతాను అని అర్థం వచ్చేలా ఉన్న స్లోగన్ ఫోటోషాప్ చేయబడినది. ఒరిజినల్ ఫోటోలో దీపికా పదుకొనె పూర్తి నలుపు రంగులో ఉన్న టి-షర్ట్ ధరించింది. ఆ టి-షర్ట్ పై ఏమి రాసి లేదు. దీపికా పదుకొనె JNU లో జరిగిన నిరసనలలో విద్యార్ధులకు సంఘీభావం తెలిపిన మాట వాస్తమైనప్పటికి, ఇటివలే రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలకి మద్దతు ఇస్తున్నట్టు ఎక్కడ దీపికా  ప్రకటించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు దోవ పట్టించేలా ఉంది.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఒరిజినల్ ఫోటో ‘The Indian Express’ న్యూస్ వెబ్ సైట్ ‘20 March 2018’ నాడు పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్ లో దొరికింది. ఒరిజినల్ ఫోటోలో దీపికా పదుకొనె ధరించిన టి-షర్ట్ పై ‘I STAND WITH INDIAN FARMERS’ అనే స్లోగన్ రాసి లేదు. ఈ ఫోటోలో దీపికా పదుకొనె పూర్తి నలుపు రంగులో ఉన్న టి-షర్ట్  ధరించి ఉన్నట్టు కనిపిస్తుంది. దీపికా పదుకొనె విమానాశ్రయం నుండి బయటికి వస్తున్నప్పుడు తీసిన ఫోటో అని ఆర్టికల్ లో తెలిపారు. ఈ ఒరిజినల్ ఫోటో, ‘idiva’ వెబ్ సైట్ ‘17 మార్చ్ 2018’ నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్ లో కూడా దొరికింది.

‘5 జనవరి 2020’ నాడు ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ లో కొందరు దుండగులు యూనివర్సిటీ విద్యార్ధులపై అలాగే టీచర్లపై దాడి చేసారు. ఈ దాడులలో JNUSU ప్రెసిడెంట్  ఆయిషి ఘోష్ కి కూడా గాయాలయ్యాయి. ఈ దాడులకి నిరసనగా JNU విద్యార్థి సంఘాలు ‘07 జనవరి 2020’ నాడు యూనివర్సిటీలో చేసిన భారీ ఆందోళన కార్యక్రమంలో దీపికా పదుకొనె పాల్గొన్న దృశ్యాలు ఇక్కడ చూడవచ్చు. JNUSU మాజీ ప్రెసిడెంట్ కన్హయ్య కుమార్ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. JNUSU ప్రెసిడెంట్ ఆయిషి ఘోష్, కన్హయ్య కుమార్ లతో దీపికా పదుకొనె ఉన్న ఫోటో ‘Hindustan Times’ గాలరీ ఆర్టికల్ లో దొరికింది. అది ఇక్కడ చూడవచ్చు.

దీపికా పదుకొనె JNU లో జరిగిన నిరసనలలో విద్యార్ధులకు సంఘీభావం తెలిపిన మాట వాస్తమైనప్పటికి, ఇటివలే భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకి  మద్దతు ఇస్తున్నట్టు ఎక్కడ దీపికా పదుకొనె  ప్రకటించలేదు.

చివరగా, దీపికా పదుకొనె ధరించిన టి-షర్ట్ పై రైతులకు అండగా నిలబడతాను అని అర్థం వచ్చేలా ఎటువంటి స్లోగన్ రాసి లేదు.

Share.

About Author

Comments are closed.

scroll