Fake News, Telugu
 

రాహుల్ గాంధీ తన భోజనం ముగిసిన తర్వాత మాస్క్ ధరించి మాట్లాడుతున్న ఫోటోని తప్పుగా ప్రచారం చేస్తున్నారు

0

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాస్క్ ధరించి భోజనం చేస్తున్న దృశ్యం, అంటూ ఒక యూసర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఒక విందు కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాస్క్ ధరించి పక్క వ్యక్తులతో మాట్లాడుతున్న ఫోటోని ఈ పోస్టులో షేర్ చేసారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాస్క్ ధరించి భోజనం చేస్తున్న ఫోటో.

ఫాక్ట్ (నిజం): రాహుల్ గాంధీ తమిళనాడు ఎరోడ్ నగరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా, అక్కడి ప్రజలతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు తీసిన ఫోటో ఇది. భోజనం చేసే సమయంలో రాహుల్ గాంధీ తన మాస్క్ ధరించలేదు. భోజనం ముగించిన తర్వాత తనతో పాటు కూర్చున్న వ్యక్తులతో మాస్క్ ధరించి మాట్లాడినప్పుడు తీసినదే ఈ ఫోటో. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోకి సంబంధించిన వివరాల కోసం వెతికితే, ఈ ఫోటో రాహుల్ గాంధీ తమిళనాడు లోని ఎరోడ్ నగరంలో 24 జనవరి 2021 నాడు నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో తీసినదని తెలిసింది. పోస్టులోని ఈ ఫోటోతో సహా మరికోన్ని ఫోటోలని షేర్ చేస్తూ తమిళనాడు యూత్ కాంగ్రెస్ తమ ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ పెట్టింది. అయితే, ఈ ఫోటోలని గమనిస్తే పోస్టులో షేర్ చేసిన ఫోటో రాహుల్ గాంధీ భోజనం ముగించుకున్న తరువాత తీసినదని తెలుస్తుంది. భోజనం చేసే సమయంలో రాహుల్ గాంధీ తన మాస్క్ తీసినట్టు ఈ ఫోటోలలో స్పష్టంగా కనిపిస్తుంది. ‘The Hindu’ న్యూస్ వెబ్ సైట్ కూడా రాహుల్ గాంధీ మాస్క్ తీసేసి భోజనం చేస్తున్న దృశ్యాన్ని తమ ఆర్టికల్ లో పబ్లిష్ చేసింది.

రాహుల్ గాంధీ భోజనం చేస్తునప్పుడు తీసిన ఫోటోలని చాల తమిళ న్యూస్ వెబ్ సైట్స్ తమ ఆర్టికల్స్ లో పబ్లిష్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. అయితే, ఈ ఫోటోలలో రాహుల్ గాంధీ మాస్క్ తీసి భోజనం చేస్తున్న దృశ్యాలని మనం చూడవచ్చు. రాహుల్ గాంధీ మాస్క్ తీసేసి భోజనం చేస్తున్న వీడియోని  ‘Puthiyathalaimurai TV’ ఛానల్ తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో రాహుల్ గాంధీ భోజనం చేసే సమయంలో తీసినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, రాహుల్ గాంధీ తన భోజనం ముగిసాక పక్క వారితో మాస్క్ ధరించి మాట్లాడుతున్న దృశ్యాన్ని చూపిస్తూ మాస్క్ ధరించి భోజనం చేస్తున్న రాహుల్ గాంధీ అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll