Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

ఫోటో రాహుల్ గాంధీ వలస కార్మికులతో మాట్లాడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వాలంటీర్లు వారిని వాహనాల్లో ఇంటికి తరలించే సమయం లో తీసినది

0

ఫేస్బుక్ లో రెండు ఫోటోలను పోస్ట్ చేసి, వాటిల్లో ఉన్నది కాంగ్రెస్ కార్యకర్తలని, వారికి ముందుగానే ట్రైనింగ్ ఇచ్చి కార్లలో రోడ్ల మీదికి తీసుకువచ్చారని, రోడ్లపై వారు వలస కార్మికుల వేషంలో నడుచుకుంటూ పోతుండగా, పథకం ప్రకారం రాహుల్ గాంధీ వచ్చి వారితో యాద్రృచ్చికంగా మాట్లాడినట్లుగా చేసి మీడియా కవరేజ్ వచ్చేలా చేసారని చెప్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఫోటోలో రాహుల్ గాంధీ తో ఉన్నవారు వలస కార్మికులు కాదు, వారిని కార్లో తీసుకొని వచ్చి రోడ్డు మీద కూర్చోపెట్టారు. 

ఫాక్ట్ (నిజం): ఇద్దరు వ్యక్తులు కార్ లో కూర్చుని ఉన్న ఫోటో రాహుల్ గాంధీ వలస కార్మికులతో మాట్లాడిన తర్వాత తీసినది. కాంగ్రెస్ వాలంటీర్లు సుమారు 25 మంది వలసదారులను ఇళ్లకు చేర్చేందుకు వాహనాలను ఏర్పాటు చేసారు. ఇద్దరు వ్యక్తులు కార్ లో కూర్చుని ఉన్న ఫోటో కాంగ్రెస్ పార్టీ వాలంటీర్లు వారిని వాహనాల్లో ఇంటికి తరలించే సమయం లో తీసినది. కావున పోస్టు లో చెప్పింది తప్పు. 

రాహుల్ గాంధీ 16 మే 2020 న ఢిల్లీ మీదగా తమ ఇళ్లకు నడుచుకుంటూ వెళ్తున్న కొందరు వలస కార్మికులతో సంభాషించారు. ఒక ఫోటో ఆ సందర్భానికి సంబంధించినది. అదే ఫోటో ను ‘ANI’ చేసిన ట్వీట్‌ లో చూడవచ్చు.

‘ANI’ యొక్క మరోక ట్వీట్‌ లో, రాహుల్ గాంధీ వలసదారులతో సంభాషించిన తరువాత, కాంగ్రెస్ పార్టీ వాలంటీర్లు సుమారు 25 మంది వలస కూలీలను వారి ఇళ్లకు పంపేందుకు కొన్ని వాహనాలను ఏర్పాటు చేశారని చూడవొచ్చు. పోలీసులు ఇద్దరు వ్యక్తులు మాత్రమే కలిసి వెళ్లడానికి అనుమతించినందున, వలసదారులను ఇద్దరు వ్యక్తుల బృందాలుగా చేసి వారిని పంపినట్టు ఢిల్లీ కాంగ్రెస్ నాయకుడు చెప్పారు. కావున, ఇద్దరు వ్యక్తులు కార్ లో కూర్చుని ఉన్న ఫోటో కాంగ్రెస్ పార్టీ వాలంటీర్లు వారిని వాహనాల్లో ఇంటికి తరలించే సమయం లో తీసినది. ఆ ఫోటోని ఒక కాంగ్రెస్ నాయకుడు పెట్టిన ట్వీట్ లో చూడవచ్చు. ఆ సంఘటనకు సంబంధించిన న్యూస్ వీడియో ని ఇక్కడ చూడవచ్చు. అందులో వలస కార్మికులు కాంగ్రెస్ పార్టీ వారు తమను ఇళ్లకు చేరుస్తున్నారని చెప్పారు.

చివరిగా, ఇద్దరు వ్యక్తులు కార్ లో కూర్చుని ఉన్న ఫోటో రాహుల్ గాంధీ వలస కార్మికులతో మాట్లాడిన తర్వాత,కాంగ్రెస్ పార్టీ వాలంటీర్లు వారిని వాహనాల్లో ఇంటికి తరలించే సమయం లో తీసినది.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll