Fake News, Telugu
 

పీ.వీ. సింధు బ్యాడ్మింటన్ ఆట నుండి రిటైర్మెంట్ ప్రకటించలేదు

0

రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్ స్టార్ పీ.వీ. సింధు అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్ స్టార్ పీ.వీ.సింధు.

ఫాక్ట్ (నిజం): పీ.వీ. సింధు బ్యాడ్మింటన్ ఆటనుండి రిటైర్మెంట్ ప్రకటించలేదు. సింధు కరోనా వైరస్ మరియు దానివల్ల ఎదురుకోవాల్సిన పరిస్థితుల గురించి చేసిన ట్వీట్ రిటైర్మెంట్ ప్రకటించినట్టు వస్తున్న వార్తలకి కారణమైంది. సింధు చేసిన ఈ ట్వీట్ ని తప్పుగా అర్ధం చేసుకొని కొన్ని వార్తా సంస్థలు సింధు బ్యాడ్మింటన్ కి రిటైర్మెంట్ ప్రకటించినట్టు కథనాలు ప్రచురించచాయి. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కూడా సింధు ట్వీట్ ని తప్పుగా అర్ధం చేసుకొని తనకి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ విషయం గురించి మరింత సమాచారం కోసం గూగుల్ లో వెతకగా సింధు రిటైర్ అవుతుందని వస్తున్న వార్తలకి కారణమైన సింధు చేసిన ట్వీట్ ఒకటి మాకు కనిపించింది. ఈ ట్వీట్ ద్వారా సింధు కరోనా వైరస్ మరియు దానివల్ల ఎదురుకోవాల్సిన పరిస్థితుల గురించి మాట్లాడింది. ఈ ట్వీట్ లో సింధు కరోనా వైరస్ తనలో సృష్టించిన అనిశ్చితి, అశాంతి నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నానని చెప్పిందే తప్ప తను బ్యాడ్మింటన్ కి రిటైర్మెంట్ తెలుపుతున్నట్టు ఎక్కడా చెప్పలేదు. పైగా ఈ ట్వీట్ లో తను ఆసియా ఓపెన్ టోర్నమెంట్ లో పాల్గొంటానని చెప్పింది. ప్రజలలో కరోనా వైరస్ పట్ల ఉన్న నిర్లక్ష వైకరి తొలగించాలని ఈ ట్వీట్ చేస్తున్నట్టు తెలిపింది.

ఐతే సింధు చేసిన ఈ ట్వీట్ ని తప్పుగా అర్ధం చేసుకొని కొన్ని వార్తా సంస్థలు సింధు బ్యాడ్మింటన్ కి రిటైర్మెంట్ ప్రకటించినట్టు కథనాలు ప్రచురించి తరవాత తప్పును సవరిస్తూ కథనాలు అప్డేట్ చేసాయి. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కూడా సింధు ట్వీట్ ని తప్పుగా అర్ధం చేసుకొని తనకి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసాడు. తరవాత ఆ ట్వీట్ ని డిలీట్ చేసాడు.

చివరగా, పీ.వీ. సింధు బ్యాడ్మింటన్ ఆటకి రిటైర్మెంట్ ప్రకటించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll