Fake News, Telugu
 

కాశ్మీర్ అంశం UN సెక్యూరిటీ కౌన్సిల్ వివాదాస్పద భూభాగాల లిస్ట్ లోనుండి 2010లోనే తొలగించారు,ఇప్పుడు కాదు

0

UN పెండింగ్ లిస్ట్ నుండి కాశ్మీర్ అంశం పూర్తిగా తొలిగించబడిందని, ఇది మోదీ సాధించిన దౌత్య విజయమని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మోదీ సాధించిన దౌత్య విజయం – UN పెండింగ్ లిస్ట్ నుండి కాశ్మీర్ అంశం పూర్తిగా తొలిగించబడింది.

ఫాక్ట్ (నిజం): కాశ్మీర్ అంశం UN సెక్యూరిటీ కౌన్సిల్ వివాదాస్పద భూభాగాల లిస్ట్ లో నుండి 2010 లోనే తొలగించబడింది. ఈ విషయానికి, మోదీకి ఎటువంటి సంబంధం లేదు, మోదీ అప్పటికింకా ప్రధానమంత్రి కూడా కాలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో ఉన్న విషయానికి సంబంధించి మరింత సమాచారం కొరకు గూగుల్ లో వెతకగా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్న కొన్ని 2010 వార్తా కథనాలు మాకు దొరికాయి. ఈ కథనాల ప్రకారం 2010 నవంబర్ లో జరిగిన UN జనరల్ అసెంబ్లీ సమావేశాలలో పాకిస్తాన్ రాయబారి UN సెక్యూరిటీ కౌన్సిల్ వివాదాస్పద భూభాగాల లిస్ట్ లోనుండి కాశ్మీర్ అంశాన్ని తొలగించడం గమనించి నిరసన తెలిపాడు.

ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్న మరొక 2010 వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు. పాకిస్తాన్ కి చెందిన ఒక పత్రిక ఇదే విషయాన్ని ప్రచురించిన 2010 వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు. పైగా కాశ్మీర్ అంశాన్ని వివాదాస్పద భూభాగాల లిస్ట్ లోనుండి ఇటీవలే తొలగించినట్టు ఎటువంటి వార్తా కథనాలుగాని లేక ప్రభుత్వ సమాచారంగాని మాకు లబించలేదు. దీన్నిబట్టి కాశ్మీర్ అంశం 2010 లోనే తొలగించబందని తెలుస్తుంది, అప్పటికింకా నరేంద్ర మోదీ ప్రధాని కాలేదు కాబట్టి ఈ విషయానికి మోదీకి ఎటువంటి సంబంధంలేదని కచ్చితంగా చెప్పొచ్చు.

చివరగా, కాశ్మీర్ అంశం UN సెక్యూరిటీ కౌన్సిల్ వివాదాస్పద భూభాగాల లిస్ట్ లో నుండి 2010 లోనే తొలగించబడింది.

Share.

About Author

Comments are closed.

scroll