Fake News, Telugu
 

2017 ఫోటోని బీహార్ ఎన్నికల నేపధ్యంలో యథేచ్ఛగా మద్యం పంపిణీ చేస్తున్న బీజేపీ అని షేర్ చేస్తున్నారు

0

బీహార్ లో యథేచ్ఛగా మద్యం పంపిణీ చేస్తున్న బీజేపీ, అంటూ షేర్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బీజేపీ పార్టీ కండువా కట్టుకున్న ఒక వ్యక్తి మద్యం తాగుతున్న ఫోటో ఈ పోస్టులో షేర్ చేసారు. బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్న నేపధ్యంలో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో బీజేపీ యథేచ్ఛగా మద్యం పంపిణీ చేస్తున్న ఫోటో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో పాతది. ఇదే ఫోటోని ఒక యూసర్ 2017లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ ఫోటోకి బీహార్ లో జరుగబోతున్న ఎన్నికలకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పాత పోస్టులు దొరికాయి. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ ఫోటో కనీసం 2017 నుంచి సోషల్ మీడియాలో షేర్ చేస్తునట్టు తెలుస్తుంది. పోస్టులో షేర్ చేసిన ఆ ఫోటో ఎక్కడిది అని తెలుసుకోలేనప్పటికి, ఈ ఫోటోకి బీహార్ లో జరుగబోతున్న ఎన్నికలకి ఎటువంటి సంబంధం లేదని ఈ వివరాల ఆధారంగా చెప్పవచ్చు.

చివరగా, 2017 ఫోటోని చూపిస్తూ బీహార్ ఎన్నికల నేపధ్యంలో యథేచ్ఛగా మద్యం పంపిణి చేస్తున్న బీజేపీ అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll