Fake News, Telugu
 

కశ్మీరీ హిందువులు శ్రీనగర్‌లోని గణపత్యర్ ఆలయంలో గణేష్ చతుర్థిని చాలా సంవత్సరాల నుండి జరుపుకుంటున్నారు

0

కాశ్మీరీ హిందువులు 31 సంవత్సరాల తర్వాత శ్రీనగర్‌లోని గణపత్యర్ ఆలయంలో గణేష్ చతుర్థిని జరుపుకున్నారు” అని అంటూ ఒక వీడియోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. శ్రీనగర్‌లోని గణపత్యర్ ఆలయంలో హవన్ కూడా నిర్వహించబడిందని పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కశ్మీరీ హిందువులు 31 సంవత్సరాల తరువాత శ్రీనగర్‌లోని గణపత్యర్ ఆలయంలో గణేష్ చతుర్థిని జరుపుకున్నారు.

ఫాక్ట్: ఎన్నో సంవత్సరాల నుండి శ్రీనగర్‌లోని గణపత్యర్ ఆలయంలో కశ్మీరీ హిందువులు గణేష్ చతుర్థిని జరుపుకుంటున్నారు, గత రెండు సంవత్సరాలు కోవిడ్ వలన ఆలయంలో హవన్ జరుపుకోలేకపోయారు. ఇటీవల, 31 సంవత్సరాల క్రితం మూసివేసిన శ్రీనగర్ లోని షీతల్ నాథ్ ఆలయం బసంత పంచమి సందర్భంగా తిరిగి తెరవబడింది. కానీ ఈ ఆలయానికి, దగ్గరలో ఉన్న గణపత్యర్ ఆలయానికి ఈ విషయంలో సంబంధంలేదు. కశ్మీరీ హిందువులు 31 సంవత్సరాల తరువాత శ్రీనగర్‌లోని గణపత్యర్ ఆలయంలో గణేష్ చతుర్థిని జరుపుకున్నారని ఎటువంటి సమాచారం లేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే విజువల్స్‌తో ఉన్న ఒక యూట్యూబ్‌ వీడియో లభించింది. ఈ యూట్యూబ్‌ వీడియో టైటిల్, “కశ్మీరీ హిందువులు పురాతన గణపత్యర్ ఆలయంలో గణేష్ చతుర్థిని జరుపుకుంటున్నారు” అని ఇంగ్లీష్‌లో ఉంది. కొన్ని సంవత్సరాల తరువాత, గణేష్ చతుర్థికి సంబంధించిన మంత్రాలు శ్రీనగర్‌లోని గణపత్యర్ ఆలయంలో ప్రతిధ్వనించాయి అని యూట్యూబ్‌ వీడియో వివరణలో ఉన్నట్టు చూడొచ్చు. కానీ, 31 సంవత్సరాలు అని అక్కడ వీడియోలో గాని వివరణలో గాని లేదు.

2021లో కశ్మీరీ హిందువులు గణపత్యర్ ఆలయంలో గణేష్ చతుర్థిని జరుపుకున్నారు. హవన్ కూడా నిర్వహించబడిందని ఈ ఆర్టికల్ ద్వారా చూడొచ్చు. ఇదే విషయానికి సంబంధించి మరో వీడియో ఉంది. సందీప్ అనే వ్యక్తి మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ హవన్ చేస్తున్నారని, గత రెండు సంవత్సరాలు కోవిడ్ వలన ఆలయంలో హవన్ జరుపుకోలేకపోయామని చెప్పారు.

గత సంవత్సరాలలో కూడా శ్రీనగర్‌లోని గణపత్యర్ ఆలయంలో కశ్మీరీ హిందువులు గణేష్ చతుర్థిని జరుపుకున్నట్టు ఆర్టికల్స్ ద్వారా ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఇటీవల, 31 సంవత్సరాల క్రితం మూసివేసిన శ్రీనగర్ లోని షీతల్ నాథ్ ఆలయం బసంత పంచమి సందర్భంగా తిరిగి తెరవబడిందని తెలిసింది. కానీ, ఈ ఆలయానికి మరియు దగ్గరలో ఉన్న గణపత్యర్ ఆలయానికి ఇందులో సంబంధంలేదు. కశ్మీరీ హిందువులు 31 సంవత్సరాల తరువాత శ్రీనగర్‌లోని గణపత్యర్ ఆలయంలో గణేష్ చతుర్థిని జరుపుకున్నారని ఎటువంటి సమాచారం లేదు.

చివరగా, కశ్మీరీ హిందువులు శ్రీనగర్‌లోని గణపత్యర్ ఆలయంలో గణేష్ చతుర్థిని ఎన్నో సంవత్సరాల నుండి జరుపుకుంటున్నారు, కోవిడ్ మూలాన కొంత విరామం వచ్చింది అంతే.

Share.

About Author

Comments are closed.

scroll