Fake News, Telugu
 

ఒక యాడ్ షూట్ వీడియోని అత్యాచారం చేయడానికి వచ్చిన అబ్బాయిలని అమ్మాయి చితకబాదుతున్నట్టు షేర్ చేస్తున్నారు

0

ఆరుగురు అబ్బాయిలు ఒక అమ్మాయిని అత్యాచారం చేయబోతే, ఆ అమ్మాయి తిరిగి వారిని  చితకబాదుతున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తనని అత్యాచారం చేయడానికి వచ్చిన అబ్బాయిలని ఒక అమ్మాయి చితకబాదుతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన దృశ్యాలు ఒక ప్రకటన వీడియోకు సంబంధించినవి. హై స్కూల్ పాఠశాల అమ్మాయిలు, లైంగిక వేధింపుల నుండి తమను తాము రక్షించుకోవడం ఎలా అనే విషయం పై ఈ అవగాహన ప్రకటన దక్షిణ కొరియాలో రూపొందించారు. ఈ వీడియోలోని ఘటన నిజంగా చోటుచేసుకుంది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘K-Tigers Co.Ltd’ ఫేస్బుక్ పేజి 17 మార్చి 2015 నాడు షేర్ చేసినట్టు తెలిసింది. హై స్కూల్ పాఠశాల అమ్మాయిల ఆత్మరక్షణకు సంబంధించి దక్షిణ కొరియా ప్రముఖ నటి మరియు మార్షల్ ఆర్టిస్ట్ టయిమి ఈ అవగాహన  వీడియో రూపొందించినట్టు పోస్టు వివరణలో తెలిపారు.

‘K-Tigers Co.Ltd’ సంస్థ ఈ వీడియోని తమ యూట్యూబ్ ఛానెల్లో కూడా షేర్ చేసింది. హై స్కూల్ పాఠశాలలో ఎదుర్కొనే వేధింపుల నుండి అమ్మాయిలు తమని తాము ఎలా రక్షించుకోవాలనే విషయం పై ఈ అవగాహన వీడియో రూపొందించినట్టు వివరణలో తెలిపారు. ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు చిత్రికరించబడినవని, నిజజీవితంలో చోటుచేసుకున్న ఘటన కాదని ఈ వీడియో వివరణలో స్పష్టంగా తెలిపారు. ‘K-Tigers Co.Ltd’ పబ్లిష్ చేసిన ఈ వీడియోని ‘UNITEDKPOP’ అనే వెబ్సైటు కూడా షేర్ చేసింది.

చివరగా, హై స్కూల్ పాఠశాల అమ్మాయిల ఆత్మరక్షణకు సంబంధించి రూపొందించిన ఒక ప్రకటన వీడియోని నిజజీవితంలో  చోటుచేసుకున్న ఘటనగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll