Fake News, Telugu
 

‘ఇండియా టుడే’ ఆర్టికల్‌లో పబ్లిష్ చేసిన ప్రజ్ఞానంద ఫోటో ఎడిట్ చేసినది కాదు

0

భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద నుదుటిపై ఉన్న విభూదిని ‘ఇండియా టుడే’ వార్తా సంస్థ ఎడిటింగ్లో తొలగించి తమ ఆర్టికల్‌లో ఒక ఫోటోని పబ్లిష్ చేసింది, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. హిందూమతంపై ఉన్న ద్వేషం కారణంగానే ‘ఇండియా టుడే’ ప్రజ్ఞానంద నుదుటి పై ఉన్న విభూదిని కావాలని ఎడిట్ చేసిందని ఈ పోస్టులో ఆరోపిస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద నుదుటిపై ఉన్న విభూదిని ‘ఇండియా టుడే’ వార్తా సంస్థ ఎడిటింగ్లో తొలగించి తమ ఆర్టికల్‌లో ఒక ఫోటోని పబ్లిష్ చేసింది.

ఫాక్ట్ (నిజం): ‘ఇండియా టుడే’ వార్తా సంస్థ పబ్లిష్ చేసిన ప్రజ్ఞానంద ఫోటో ఎడిట్ చేసినది కాదు. ఈ ఫోటోని మొట్టమొదట ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (FIDE) సంస్థ తమ ట్విట్టర్ హ్యాండిల్‌లో 2020లో షేర్ చేసింది. FIDE షేర్ చేసిన ఫోటోలో కూడా ప్రజ్ఞానంద నుదిటిపై ఉన్న విభూది మసకబారినట్టుగా కనిపిస్తుంది. ప్రజ్ఞానంద విభూది లేకుండా చెస్ ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వీడియోలో కనిపిస్తూన్న ‘ఇండియా టుడే’ ఆర్టికల్ కోసం ఇంటర్నెట్లో వెతికితే, ప్రపంచ చెస్ దిగ్గజం మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద రెండో సారి ఓడించాడని రిపోర్ట్ చేస్తూ ‘ఇండియా టుడే’ ఈ ఆర్టికల్‌ని 21 మే 2022 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ‘ఇండియా టుడే’ ఈ ఫోటో క్రెడిట్స్ ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (FIDE) సంస్థకి ఇచ్చింది. FIDE ఈ ఫోటోని 2020 ఆగష్టు నెలలో ట్వీట్ చేసినట్టు తెలిసింది. FIDE ట్వీట్ చేసిన ఫోటోలో కూడా ప్రజ్ఞానంద నుదుటిపై ఉన్న విభూది మసకబారినట్టుగా, చిన్నదిగా కనిపిస్తుంది.

‘ఇండియా టుడే’ పబ్లిష్ చేసిన ఇదే ఫోటోని మరికొన్ని వార్తా సంస్థలు కూడా తమ ఆర్టికల్స్‌లో పబ్లిష్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ప్రజ్ఞానంద సాధారణంగా నుదిటిపై పొడవైన విభూది పెట్టుకొని చెస్ ఆడుతాడు. కానీ, ప్రజ్ఞానంద విభూది లేకుండా లేదా విభూది చిన్నది పెట్టుకొని చెస్ గేమ్స్ ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి కొన్ని సందర్భాలలో తీసిన ప్రజ్ఞానంద ఫోటోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో చూపిస్తున్న చేసిన ‘ఇండియా టుడే’ ఆర్టికల్‌లోని ప్రజ్ఞానంద ఫోటో ఎడిట్ చేసినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ‘ఇండియా టుడే’ ఆర్టికల్‌లో పబ్లిష్ చేసిన ప్రజ్ఞానంద ఫోటో ఎడిట్ చేసినది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll