Fake News, Telugu
 

ఈ వీడియోలో కనిపిస్తున్న దాడి 2018 లో నితీష్ కుమార్ కాన్వాయ్ పై జరిగింది, తాజగా బీజేపీ కాన్వాయ్ పై కాదు.

0

‘బీజేపీ కాన్వాయ్ పై రాళ్ళు రువ్వుతున్న బీహార్ ప్రజలు’, అంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, ప్రజలు బీజేపీ కి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారంటూ ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.    

క్లెయిమ్: బీహార్ లో బీజేపీ కాన్వాయ్ పై ప్రజలు రాళ్ళు రువ్వుతున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో పాతది. 2018లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ‘వికాస్ సమీక్ష యాత్ర’లో భాగంగా బక్సర్ గ్రామాన్ని సందర్శించినప్పుడు, అక్కడి ప్రజలు నితీష్ కుమార్ కాన్వాయ్ పై ఇలా రాళ్ళతో దాడి చేసారు. పోస్టులో షేర్ చేసిన ఈ వీడియోకి, బీహార్ లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగి ఉన్న వీడియోని ‘News 18’ న్యూస్ వెబ్ సైట్ 13 జనవరి 2018 నాడు తమ ఫేస్బుక్ పేజిలో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ రాళ్ల దాడి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాన్వాయ్ పై 12 జనవరి 2018 నాడు బీహార్ లోని బక్సర్ గ్రామంలో జరిగినట్టు ఈ వీడియో ద్వార తెలిసింది. 2018లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ‘వికాస్ సమీక్ష యాత్ర’లో భాగంగా బక్సర్ గ్రామాన్ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు, అక్కడి ప్రజలు నితీష్ కుమార్ కాన్వాయ్ పై ఇలా రాళ్ళతో దాడి చేసినట్టు వీడియోలో తెలిపారు. పోస్టులో షేర్ చేసిన వీడియోలోని అవే దృశ్యాలను చూపుతూ ‘INDIA TV’ న్యూస్ ఛానల్ యూట్యూబ్ లో పోస్ట్ చేసిన వీడియోని ఇక్కడ చూడవచ్చు.

బక్సర్ లో నితీష్ కుమార్ కాన్వాయ్ పై జరిగిన దాడికి సంబంధించి చాలా మీడియా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఈ వీడియోకి బీహార్ లో జరుగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకి ఎటువంటి సంబంధం లేదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.  

చివరగా, 2018 లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాన్వాయ్ పై జరిగిన దాడిని చూపిస్తూ, బీజేపీ కాన్వాయ్ పై బీహార్ ప్రజలు రాళ్ళ దాడి చేస్తున్నారంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll