Fake News, Telugu
 

పోస్ట్ లో చెప్పిన పినరాయి విజయన్ – అజిత్ దోవల్ కథ అవాస్తవం.

0

కేరళలో తలస్సేరి మత ఘర్షణల (1971-72) సమయంలో గొడవలు చేస్తున్న ‘గూండా విజయన్ కొరాన్’ (కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్) ని అప్పుడే అక్కడ పోస్ట్ అయిన IPS ఆఫీసర్ ASP అజిత్ దోవల్ పోలీస్ స్టేషన్ సెల్ లో వేసి బెదిరించినట్టు చెప్తూ ఒక కథతో కూడిన ఫేస్బుక్ పోస్ట్ ని చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 1972 లో కేరళలో గొడవలు చేస్తున్న ‘గూండా విజయన్ కొరాన్’ ని అజిత్ దోవల్ పోలీస్ స్టేషన్ సెల్ లో వేసి బెదిరించాడు.

ఫాక్ట్ (నిజం): 1971-72 లో కేరళలోని తలస్సేరి లో మత ఘర్షణల జరిగిన మాట వాస్తవమే, వాటిని అదుపు చేయడానికి అజిత్ దోవల్ ని ఆక్కడికి పంపించిన మాట వాస్తవమే, కానీ ‘గూండా విజయన్ కొరాన్’ గొడవలు చేసి అజిత్ దోవల్ ద్వారా  బెదిరించబడినట్టు ఎక్కడా ఆధారాలు లేవు. అంతేకాదు, అప్పటికే పినరాయి విజయన్ ఒక MLA. ‘కోరన్’ అనేది తన తండ్రి పేరు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని ఘటన గురించి వెతకగా, 1971-72 లో కేరళలోని తలస్సేరి లో మత ఘర్షణల జరిగినట్టు తెలుస్తుంది. నిజంగానే ఆ మత ఘర్షణలను అదుపు చేయడానికి అజిత్ దోవల్ ని ఆక్కడికి పంపించినట్టు వివిధ వార్తాసంస్థల ఆర్టికల్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. కన్నూర్ ఘర్షణల పై రాసిన ఒక పుస్తకంలో కూడా అజిత్ దోవల్ గురించి చదవొచ్చు. కానీ, పోస్ట్ లో చెప్పిన సంఘటన జరిగినట్టు ఎక్కడా కూడా ఆధారాలు లేవు

ఆ సమయంలో పినరాయి విజయన్ ఒక గూండా అని పోస్ట్ లో రాసి ఉన్నట్టు చూడవొచ్చు. కానీ, అప్పటికే పినరాయి విజయన్ ఒక ఎంఎల్ఏ. 1970 ఎన్నికల్లో కూతుపరంబ నియోజికవర్గం నుండి ఎంఎల్ఏ గా ఎన్నికయ్యాడు.

విజయన్ అసలు పేరు ‘విజయన్‌ కొరాన్’ అని, పోస్ట్ లో చెప్పిన సంఘటన తరువాత పోలీసు రికార్డులో ఉన్న పేరు మార్చుకుని, ‘పినరాయి విజయన్’ అని కొత్త పేరు పెట్టుకునట్టు పోస్ట్ లో రాసి ఉన్నట్టు చదవొచ్చు. అయితే, తన తండ్రి పేరు ‘కోరన్’ అని కేరళ ముఖ్యమంత్రి అధికారిక వెబ్సైటులో మరియు పినరాయి విజయన్ ఎన్నికల అఫిడవిట్ లో చూడవొచ్చు. 1970లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబందించిన ఎలక్షన్ కమిషన్ వారి అధికారిక రికార్డ్స్ లో కూడా తన పేరు ‘పినరాయి విజయన్’ అనే ఉంది. తన పేరు 1970 తర్వాత మార్చుకున్నాడు అనేది కూడా అవాస్తవం.

1971-72 తలస్సేరి మత ఘర్షణలకి సంబంధించి ప్రభుత్వ డాక్యుమెంట్లలో ఉన్న వివరాలను ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు. 

చివరగా, పోస్ట్ లో చెప్పిన పినరాయి విజయన్ – అజిత్ దోవల్ కథ అవాస్తవం.

Share.

About Author

Comments are closed.

scroll