Fake News, Telugu
 

వీడియోలోని లారీ బోల్తా పడిన ఘటన తమిళనాడు లోని దిండిగల్ లో జరిగింది, శ్రీకాకుళం (ఆంధ్రప్రదేశ్)లో కాదు

0

శ్రీకాకుళం టెక్కలిలో మద్యం లారీ బోల్తా’’ అనే టైటిల్ తో ఉన్న యూట్యూబ్ వీడియో ని ఒక యూజర్ ఫేస్బుక్ లో పోస్టు చేసాడు. ఆ వీడియోలో ఒక హైవేపై మద్యం లారీ బోల్తా పడగా కొంతమంది వ్యక్తులు ఆ లారీ లో నుండి మద్యం సీసాలు తీసుకెళ్తూ కనిపిస్తారు. పోస్ట్ లో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో బోల్తా పడిన మద్యం లారీ వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియో లోని లారీ బోల్తా పడిన ఘటన తమిళనాడు లోని దిండిగల్ లో జరిగింది, శ్రీకాకుళం (ఆంధ్రప్రదేశ్) లో కాదు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

పోస్టులోని వీడియోని అదే వివరణతో ‘News18 Telugu’ తమ ఫేస్బుక్ పేజ్ లో పోస్టు (ఆర్చివ్డ్) చేసింది. పోస్టులోని వీడియోలో ఒక హైవేపై మద్యం లారీ బోల్తా పడగా కొంతమంది వ్యక్తులు ఆ ట్రక్కు లో నుండి మద్యం సీసాలు తీసుకెళ్తూ కనిపిస్తారు. దాంతో గూగుల్ లో ‘passersby pick liquor bottles from overturned truck’ అనే కీవర్డ్స్ తో వెతికినప్పుడు, అలాంటి విజువల్స్ తోనే ఉన్న వీడియో ని ‘Indian Express’ వార్తా సంస్థ ఫేస్బుక్ పేజ్ లో లభించింది. ‘Indian Express’ వార్తా సంస్థ ఆ వీడియో లోని ఘటన దిండిగల్ లో జరిగినట్లుగా పోస్ట్ చేసింది. ‘దిండిగల్’ అనేది తమిళనాడు రాష్ట్రం లోని ఒక జిల్లా. 

పైన ఉన్న సమాచారం ఆధారంగా గూగుల్ లో ‘Liquor bottles truck overturned in Dindigul’ అనే అర్ధం వచ్చేలా తమిళ భాషలో వెతికినప్పుడు, ‘నక్కీరన్ ’ అనే తమిళ న్యూస్ వెబ్సైట్ వీడియోలోని ఘటన ఆధారంగా రాసిన కథనం లభించింది. ఆ కథనం లో దిండిగల్‌లోని వేదాసందూర్ పట్టణానికి సమీపంలోని రహదారిపై మద్యం బాటిళ్లతో నిండిన లారీ బోల్తా పడిందని, అనంతరం సమీప ప్రాంతాల ప్రజలు మరియు హైవేపై బాటసారులు లారీ నుండి మద్యం సీసాలు పట్టుకెళ్లారని ఉంది. వీడియోలోని ఘటన దిండిగల్‌లో జరిగినట్లుగా రాసిన మరిన్ని న్యూస్ రిపోర్ట్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరగా, వీడియో లోని లారీ బోల్తా పడిన ఘటన తమిళనాడు లోని దిండిగల్ లో జరిగింది, శ్రీకాకుళం (ఆంధ్రప్రదేశ్) లో కాదు.

Share.

About Author

Comments are closed.

scroll