Fake News, Telugu
 

లెహ్ స్టేడియం నిర్మాణ పనుల ఫోటోలని భారత ప్రభుత్వం లడఖ్ లో కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు అని షేర్ చేస్తున్నారు

0

భారత్ – చైనా సరిహద్దులోని లడఖ్ ప్రాంతంలో భారత దేశం కొత్తగా రోడ్లు నిర్మిస్తున్న ఫోటోలు అని షేర్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిర్మాణ పనులకి సంబంధించిన ఫోటోలు ఈ పోస్టులో షేర్ చేసారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారత ప్రభుత్వం లడఖ్ ప్రాంతంలో కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు ఫోటోలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోలు లడఖ్ ప్రాంతంలో కొత్తగా నిర్మిస్తున్న లెహ్ స్టేడియం కి సంబంధించినవి. లెహ్ స్టేడియం లోని ఫుట్ బాల్ ఆస్ట్రో టర్ఫ్ మరియు సింథటిక్ ట్రాక్ నిర్మాణ పనులని చూపుతూ ఈ ఫోటోలని లడఖ్ డివిజనల్ కమిషనర్ షేర్ చేసారు. ఇటీవల చైనా తో జరిగిన ఘర్షణల అనంతరం భారత ప్రభుత్వం లడఖ్ ప్రాంతంలో రోడ్డు రవాణా పనులు వేగవంతం చేసింది. కానీ, ఈ ఫోటోలు దానికి సంబందించినవి కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు దోవ పట్టిస్తుంది.

పోస్టులో షేర్ చేసిన ఫోటోలని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే ఫోటోలని ‘Prasar Bharati Ladakh’ వారు ‘05 నవంబర్ 2020’ నాడు తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసినట్టు తెలిసింది. ఈ ఫోటోలు లడఖ్ లోని లెహ్ స్టేడియం కి సంబంధించినవి అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. లెహ్ స్టేడియంలో నిర్మిస్తున్నఫుట్ బాల్ ఆస్ట్రో టర్ఫ్ మరియు సింథటిక్ ట్రాక్ నిర్మాణ పనులకి సంబంధించిన ఫోటోలని లడఖ్ ప్రసార భారతి తమ ట్వీట్లో తెలిపారు.

ఈ ఫోటోలు లెహ్ స్టేడియం లోని నిర్మిస్తున్న ఫుట్ బాల్ ఆస్ట్రో టర్ఫ్ మరియు సింథటిక్ ట్రాక్ నిర్మాణ పనులకి సంబంధించినవని తెలుపుతూ లడఖ్ డివిజనల్ కమిషనర్ పెట్టిన ట్వీట్ ఇక్కడ చూడవచ్చు. ఈ స్టేడియం ఇంకో నెల రోజులలో వాడుకంలోకి తెస్తామని డివిజనల్ కమిషనర్  తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోలు లడఖ్ ప్రాంతంలో నిర్మిస్తున్న రోడ్డులవి కాదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఇటివల చైనా సైన్యం తో జరిగిన ఘర్షణల అనంతరం భారత ప్రభుత్వం చైనా సరిహద్దు అయిన లడఖ్ ప్రాంతంలో రోడ్డు రవాణా పనులు వేగవంతం చేసింది. వాటికి సంబంధించిన ఆర్టికల్స్, వీడియో ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరగా, లడఖ్ లోని లెహ్ స్టేడియంలో జరుగుతున్న నిర్మాణ పనులని చూపుతూ భారత ప్రభుత్వం లడఖ్ లో నిర్మిస్తున్న కొత్త రోడ్డు అంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll