Fake News, Telugu
 

మార్ఫ్ చేసిన ఫోటోని మోదీ, ఉద్ధవ్ ఠాక్రే కి సంజయ్ రౌత్ బిస్కెట్లు అందిస్తున్నట్టు షేర్ చేస్తున్నారు

0

ప్రధానమంత్రి మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమక్షంలో శివ సేన నాయకుడు సంజయ్ రౌత్ అందరికీ బిస్కెట్లు ఇస్తున్నాడని ఒక ఫోటో సోషల్ మీడియా పోస్ట్ ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులొ ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.

క్లెయిమ్: మోదీ మరియు ఉద్ధవ్ ఠాక్రే కి సంజయ్ రౌత్ బిస్కెట్లు అందిస్తున్న ఫోటో.

ఫాక్ట్: ఈ ఫోటో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే డిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇటీవల కలిసినప్పుడు తీసినది, అందులో ఎక్కడ కూడా సంజయ్ రౌత్ లేడు. ఫోటోలో వాటర్ మార్క్ మరియు టీ గ్లాస్ లు ఆడ్ చేసారని, సంజయ్ రౌత్ హార్మోనియం వాయిస్తున్న పాత ఫోటోని అసలు ఫోటోకి మార్ఫ్ చేసి కలిపారని తెలుస్తుంది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

పోస్ట్ లోని ఫోటో ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు ‘ప్రధానితో ఉద్ధవ్ ఠాక్రే భేటీ’ అనే టైటిల్ తో ఈనాడు ప్రచురించిన న్యూస్ ఆర్టికల్ లభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే డిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసారని 08 జూన్ 2021 న ఈనాడు ఆర్టికల్ ని పబ్లిష్ చేసింది. మరాఠా రిజర్వేషన్లు, తుఫాను సాయం, టీకాలు తదితర అంశాల పై ఉద్ధవ్ ఠాక్రే మోదీతో చర్చలు జరిపినట్టు తెలిసింది. దీనికి సంభందించి మరి కొన్ని న్యూస్ ఆర్టికల్స్ ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ న్యూస్ ఆర్టికల్స్ లో ఎక్కడ కూడా సంజయ్ రౌత్ ఉన్నట్టు కనిపించదు.

ఉద్ధవ్ ఠాక్రే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, మంత్రి అశోక్ చవాన్ తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసారని ముఖ్యమంత్రి అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఫోటోలో కూడా సంజయ్ రౌత్ ఎక్కడా లేడు.

పోస్టులో ఉన్న ఫోటో మార్ఫ్ చేయబడిందని తెలుస్తుంది ఎందుకంటే ఫోటోలో వాటర్ మార్క్ మరియు టీ గ్లాస్ లు ఆడ్ చేసారు.

26 మార్చ్ 2020 లో పబ్లిష్ చేసిన న్యూస్ ఆర్టికల్ ద్వారా సంజయ్ రౌత్ హార్మోనియం వాయిస్తున్న ఫోటోని అసలు ఫోటోకి మార్ఫ్ చేసి కలిపారని తెలుస్తుంది. దీనికి సంభందించి మరో న్యూస్ ఆర్టికల్ ఇక్కడ చూడొచ్చు.

చివరగా, మార్ఫ్ చేసిన ఫోటోని మోదీ మరియు ఉద్ధవ్ ఠాక్రే కి సంజయ్ రౌత్ బిస్కెట్లు అందిస్తున్నట్టు షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll