Fake News, Telugu
 

వీధుల్లోని ఇళ్లపై మరియు బ్రిడ్జ్ పిల్లర్లపై హిందూ దేవుళ్ళ ప్రతిమలు ఉన్న ఈ ఫోటోలు అయోధ్యకి సంబంధించినవి కాదు

0

కొన్ని ఫోటోలను పోస్ట్ చేసి, అవి అయోధ్య నగరానికి సంబంధించినవని వాటి గురించి చెప్తున్నారు. ఆ ఫోటోల్లో వీధుల్లోని ఇళ్లపై మరియు బ్రిడ్జ్ పిల్లర్లపై హిందూ దేవుళ్ళ ప్రతిమలు కనిపిస్తాయి. ఆ ఫోటోలను అయోధ్య రామ మందిర ‘భూమి పూజ’ కి ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంలో షేర్ చేస్తున్నారు. పోస్ట్ లో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అయోధ్య నగర వీధుల్లోని ఇళ్లపై మరియు బ్రిడ్జ్ పిల్లర్లపై హిందూ దేవుళ్ళ ప్రతిమలు ఉన్న ఫోటోలు.

ఫాక్ట్ (నిజం): ఫోటోలు అయోధ్య నగరానికి సంబంధించినవి కాదు, అవి ప్రయాగరాజ్ (అలాహాబాద్) నగర వీధులవి. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ఫోటోలను మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అవి ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ (అలాహాబాద్) నగరానికి సంబంధించినవని తెలిసింది.

ఫోటో-1:

ఫోటోని ‘ANI UP’ ట్వీట్‌ లో చూడవచ్చు. ప్రయాగ్ రాజ్ వీధుల్లో యజమానుల అనుమతి లేకుండా వారి ఇళ్ళ పై పెయింటింగ్ చేసినందుకుగానూ నమోదైన ఫిర్యాదుల గురించి ఆ ట్వీట్‌లో సమాచారం ఉంది. కావున, ఫోటో ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్(అలాహాబాద్) నగరానికి సంబంధించినది. 

ఫోటో-2:

ఫోటోలో కనిపించే పరిసరాలను ‘NDTV’ వార్తా సంస్థ ప్రసారం చేసిన న్యూస్ వీడియో లో చూడవచ్చు. ప్రయాగ్ రాజ్‌లోని ఇళ్ల పై హిందూ దేవతలతో పెయింట్ చేసిన అంశం గురించి ‘NDTV’ ఆ వీడియో లో రిపోర్ట్ చేసింది. అలాంటి ఫోటోనే  ‘ANI UP’ ట్వీట్‌ లో కూడా చూడవచ్చు. 

ఫోటో-3:

ఫోటోని ‘Outlook’ వార్తా సంస్థ కి సంబంధించిన కథనం లో చూడవచ్చు. ఆ ఫోటో గురించి వివరణ ద్వారా, అది ప్రయాగ్ రాజ్‌లో తీసినట్లుగా తెలుస్తుంది.

ఫోటో-4:

ఫోటోని ‘Getty Images’ వెబ్సైట్ పై చూడవచ్చు. ఆ వెబ్సైట్ లో ఫోటో గురించి ఉన్న వివరణ ద్వారా, దానిని ప్రయాగ్ రాజ్ (అలాహాబాద్) లోని శాస్త్రీ బ్రిడ్జ్ వద్ద తీసినట్లుగా తెలుస్తుంది.

చివరగా, వీధుల్లోని ఇళ్లపై మరియు బ్రిడ్జ్ పిల్లర్లపై హిందూ దేవుళ్ళ ప్రతిమలు ఉన్న పోస్ట్ లోని ఫోటోలు అయోధ్య నగరానివి కాదు.

Share.

About Author

Comments are closed.

scroll