Fake News, Telugu
 

కరోనా పాజిటివ్ వచ్చిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరలేదు

0

తనకు కరోనా పాజిటివ్ అని తెలియగానే మిగితా రాజకీయ నాయకుల లాగా ప్రైవేటు ఆసుపత్రిలో చేరకుండా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక ప్రభుత్వ ఆసుపత్రి లో చేరాడని చెప్తూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కరోనా పాజిటివ్ రావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.

ఫాక్ట్ (నిజం): మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేరింది ‘చిరాయు మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్’ లో. అది ఒక ప్రైవేటు ఆసుపత్రి; ప్రభుత్వ అసుపత్రి కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

తనకు కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ రావడంతో డాక్టర్ల సలహా మేరకు ‘చిరాయు’ ఆసుపత్రిలో చేరుతున్నట్టు చెప్తూ, 25 జూలై 2020 న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేసినట్టు ఇక్కడ చూడవొచ్చు. ‘చిరాయు మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్’ వారు శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోగ్య పరిస్థితి గురించి 26 జూలై 2020 న రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్ ని ‘CMO Madhya Pradesh’ వారు కూడా ట్వీట్ చేసారు.

‘చిరాయు మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్’ ఒక ప్రైవేటు ఆసుపత్రి; ప్రభుత్వ అసుపత్రి కాదు. ఆ ఆసుపత్రి వెబ్సైటులో ‘చిరాయు హెల్త్ కేర్ అండ్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్’ వారు ఆ ఆసుపత్రి ని నడిపిస్తున్నట్టు రాసి ఉంది. అంతేకాదు, కోవిడ్-19 కి సంబంధించి ‘National Health Mission (M.P.)’ వారి వెబ్సైటులో పెట్టిన డాకుమెంట్స్ లో కూడా ‘చిరాయు మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్’ ఒక ప్రైవేట్ ఆసుపత్రి అని రాసి ఉన్నట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

శివరాజ్ సింగ్ చౌహాన్ కి కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చాక, ‘చిరాయు’ ఆసుపత్రి కి సంబంధించిన అంబులెన్స్ ముఖ్యమంత్రి నివాసానికి వచ్చినట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు .

చివరగా, కరోనా పాజిటివ్ వచ్చిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరలేదు. తను ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు.

Share.

About Author

Comments are closed.

scroll