Fake News, Telugu
 

సంబంధంలేని ఫోటోలు పెట్టి, శ్రీలంక ప్రజల చేతుల్లో దెబ్బలు తిన్న అక్కడి మంత్రులని షేర్ చేస్తున్నారు

0

శ్రీలంక ప్రజాధనాన్ని దోపిడీ చేసి మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థని నాశనం చేసిన మంత్రులని రోడ్ల పై ఈడ్చి దేహశుద్ధి చేస్తున్న శ్రీలంక ప్రజలు”, అని చెప్తూ కొన్ని ఫోటోలతో ఉన్న ఒక పోస్ట్‌ని కొంత మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: శ్రీలంక ప్రజల చేతుల్లో దెబ్బలు తిన్న అక్కడి మంత్రుల ఫోటోలు.

ఫాక్ట్: శ్రీలంకలో తాజాగా నెలకొన్న పరిస్థితులలో వివిధ వ్యక్తులపై దాడులు జరిగాయి. అయితే, ఫోటోల్లో దెబ్బలతో ఉన్న అందరు వ్యక్తులు శ్రీలంక మంత్రులని చెప్పడానికి ఎక్కడా ఎటువంటి ఆధారాలు లేవు. అందులో ఒక వ్యక్తి కొలంబో మునిసిపల్ కౌన్సెలర్స్ మరియు శ్రీలంక పీపుల్స్ ఫ్రంట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు మహింద కహందగామా. కావున, పోస్ట్‌ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్ట్‌లోని ఫోటోల్లో ఉన్న వ్యక్తుల గురించి ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ సహాయంతో వెతకగా, వాటిల్లో దెబ్బలతో ఉన్న అందరు వ్యక్తులు శ్రీలంక మంత్రులని చెప్పడానికి ఎక్కడా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఆ ఫొటోల్లో ఉన్న ఒక వ్యక్తి కొలంబో మునిసిపల్ కౌన్సెలర్స్ మరియు శ్రీలంక పీపుల్స్ ఫ్రంట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు మహింద కహందగామా అని తెలిసింది. మహింద కహందగామా పైన జరిగిన దాడి గురించి వివిధ వెబ్సైట్లు రిపోర్ట్ చేసినట్టు ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.

ఇతర ఫోటోల్లో ఉన్న వ్యక్తులకు సంబంధించి ఎటువంటి కచ్చితమైన సమాచారం లభించలేదు. వాటిల్లో ఉన్న ఒక వ్యక్తి జర్నలిస్ట్ అని కొందరు రాసినట్టు ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు. మరొక వ్యక్తి మహింద రాజపక్స మద్దతుదారుడని ఉన్న అర్టికల్‌ని ఇక్కడ చదవచ్చు.

ఇంతకుముందు కూడా ఒక వీడియోని షేర్ చేస్తూ, అందులో ప్రజల చేతుల్లో దెబ్బలు తింటున్న వ్యక్తులు శ్రీలంక మంత్రులని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది తప్పని చెప్తూ FACTLY రాసిన ఫాక్ట్-చెక్ అర్టికల్‌ని ఇక్కడ చదవచ్చు.

చివరగా, సంబంధంలేని ఫోటోలు పెట్టి, శ్రీలంక ప్రజల చేతుల్లో దెబ్బలు తిన్న అక్కడి మంత్రులని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll