Fake News, Telugu
 

వర్షపు నీటిలో ప్రయాణం చేస్తున్న ఈ వ్యక్తుల ఫోటో గుజరాత్ ది కాదు, ఉత్తర్ ప్రదేశ్ కి సంబంధించింది

0

ఒక ఫోటో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, అది గుజరాత్ రాష్ట్రం లో జరిగిన సంఘటనదని దాని గురించి చెప్తున్నారు. ఆ ఫొటో లో కొంతమంది వ్యక్తులు తమ వాహనాలతో ఒక రైల్వే బ్రిడ్జ్ అండర్ పాస్ లో నిలిచి ఉన్న వర్షపు నీటిలో ప్రయాణం చేస్తూ కనిపిస్తారు. పోస్ట్ లో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఫోటో గుజరాత్ రాష్ట్రం లోని ఒక రైల్వే బ్రిడ్జ్ అండర్ పాస్ లో నిలిచి ఉన్న వర్షపు నీటిలో ప్రయాణం చేస్తున్న వ్యక్తులది.

ఫాక్ట్ (నిజం): రైల్వే బ్రిడ్జ్ అండర్ పాస్ లో ఉన్న వర్షపు నీటిలో ప్రయాణం చేస్తున్న వ్యక్తుల ఫోటో గుజరాత్ ది కాదు, ఉత్తర్ ప్రదేశ్ ది. ఆ సంఘటన ఆగస్ట్ 2018 లో అలాహాబాద్ లో కురిసిన భారీ వర్షాల సందర్భంలో జరిగింది. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

పోస్టులో ఫోటోని మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే ఫోటో ‘Patrika’ వార్తా సంస్థ కథనం లో లభించింది. ఆ కథనం ప్రకారం, ఫోటో లోని సంఘటన ఆగస్ట్ 2018 లో అలాహాబాద్ లో కురిసిన భారీ వర్షాల సందర్భం లో జరిగింది.

ఆ కథనం లో ఫోటో ని ‘Rajesh Kumar Singh’ అనే వ్యక్తి తీసినట్లుగా ఉంది. ఆ సమాచారంతో వెతికినప్పుడు, అదే ఫోటో ‘AP Images ‘ ఫోటో స్టాక్ లో లభించింది. ఆ వెబ్సైట్ లో ఫోటో గురించి ఉన్న వివరణలో కూడా దానిని ఆగస్ట్ 2018 లో అలాహాబాద్ లో కురిసిన భారీ వర్షాల సందర్భం లో తీసినట్లుగా పేర్కొని ఉంది.

చివరగా, రైల్వే బ్రిడ్జ్ అండర్ పాస్ లో నిలిచి ఉన్న వర్షపు నీటిలో ప్రయాణం చేస్తున్న వ్యక్తుల ఫోటో గుజరాత్ ది కాదు, ఉత్తర్ ప్రదేశ్ ది.

Share.

About Author

Comments are closed.

scroll