Fake News, Telugu
 

రోడ్డు పై వరి మొక్కలు నాటుతున్న ఈ ఫోటో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించింది, తెలంగాణది కాదు

0

బురద రోడ్డుపై ఒక వ్యక్తి  వరి మొక్కలు నాటుతున్న ఫోటో ని ఫేస్బుక్ లో పోస్టు  చేసి ‘తెలంగాణా లో జోరందుకున్న వరి నాట్లు’ అని దాని గురించి చెప్తున్నారు. పోస్ట్ లో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు పై వరి మొక్కలు నాటుతున్న ఫోటో.

ఫాక్ట్ (నిజం): రోడ్డు పై వరి మొక్కలు నాటుతున్న ఆ ఫోటో ఉత్తరాఖండ్ రాష్ట్రానిది, తెలంగాణ ది కాదు. ప్రవీణ్ కొష్యారి అనే వ్యక్తి దార్చులా జిల్లాలోని బలువకొట్ అనే ఊరు లోని రోడ్ల దుస్థితిని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేయడానికి ఆ విధంగా చేసాడు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ఫోటోని క్రాప్ చేసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అలాంటి ఫోటో తోనే ఉన్న ‘Uttarakhand News Network’ అనే న్యూస్ వెబ్సైట్ యొక్క కథనం లభించింది. ఆ కథనం ప్రకారం, ప్రవీణ్ కొష్యారి అనే వ్యక్తి దార్చులా జిల్లాలోని బలువకొట్ అనే ఊరు లోని రోడ్ల దుస్థితిని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేయడానికి ఆ విధంగా చేసాడు. ఈ సంఘటన 2015 లో జరిగింది.

చివరగా, రోడ్డు పై వరి మొక్కలు నాటుతున్న ఫోటో ఉత్తరాఖండ్ రాష్ట్రానిది, తెలంగాణ ది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll