Fake News, Telugu
 

కాల్చిన మొక్కజొన్న తింటున్న ఇందిరా గాంధీ ఫోటోను పట్టుకొని చేపను తింటున్నట్టు షేర్ చేస్తున్నారు

0

భోజనం చేస్తున్న ఇందిరా గాంధీ ఫోటోని పోస్ట్ చేసి, ఆవిడ చేపను తింటున్నట్టు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: చేపను తింటున్న ఇందిరా గాంధీ ఫోటో.

ఫాక్ట్: ఫోటోలో ఇందిరా గాంధీ కాల్చిన మొక్కజొన్న తింటున్నారు, చేపను కాదు. హైదరాబాద్ లోని ఫతే మైదాన్ క్లబ్ లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ భోజనం చేయడానికి వచ్చినప్పుడు ఈ ఫోటోను డి.శ్రీధర్ నాయుడు తీసారు. డి.శ్రీధర్ నాయుడు ఒక ప్రముఖ ఫోటోగ్రాఫర్, ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్‌ మాజీ అసిస్టెంట్ డైరెక్టర్. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి గూగుల్లో వెతకగా, అదే ఫోటోతో ఉన్న ఒక ఆర్టికల్ లభించింది. ప్రముఖ ఫోటోగ్రాఫర్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్‌ మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ డి.శ్రీధర్ నాయుడు 2017లో మరణించినప్పుడు అతను తీసిన ఇందిరాగాంధీ ఫోటోను ఆర్టికల్ ద్వారా ప్రచురించారు. “మొక్కజొన్నను హృదయపూర్వకంగా ఆస్వాదిస్తున్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ” అంటూ ఆర్టికల్‌లోని ఫోటో యొక్క కాప్షన్ లో ఉంది. ఆర్టికల్‌లో ఎక్కడా కూడా ఇందిరా గాంధీ చేపను తింటున్నారని లేదు.

ఫతే మైదాన్ క్లబ్ లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కాల్చిన మొక్కజొన్న (మక్క బుట్ట) తింటున్న ఈ ఫోటోను డి.శ్రీధర్ నాయుడు తీసినట్టు తెలుస్తుంది. ఇందిరా గాంధీ ఎక్కడికి వెళ్ళినా అక్కడి స్థానిక వంటకాలను ఇష్టపడేవారని, ఈ ఆర్టికల్స్‌లో (ఇక్కడ మరియు ఇక్కడ) తెలిపారు.

చివరగా, కాల్చిన మొక్కజొన్న తింటున్న ఇందిరా గాంధీ ఫోటోను పట్టుకొని చేపను తింటున్నట్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll