‘ఆంధ్రప్రదేశ్ కు చెందిన 10 మంది మహిళలను వెనక్కి తిప్పి పంపిన శబరిమల దేవస్థాన కమిటీ’ అని చెప్తూ ఒక ఫోటో ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. అందులో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజమో పరిశీలిద్దాం.

క్లెయిమ్: ఇటీవల శబరిమల దేవస్థాన కమిటీ ఆంధ్రప్రదేశ్ కు చెందిన పది మంది మహిళలను వెనక్కి తిప్పి పంపినప్పటి ఫోటో.
ఫాక్ట్ (నిజం): ఫోటో 2018లో తమిళనాడుకి చెందిన పదకొండు మంది మహిళలు శబరిమలకి వెళ్లాలని ప్రయత్నించినప్పుడు పోలీసులు అడ్డుకున్నప్పటిది. కావున, పోస్ట్ లో తాజాగా జరిగిన ఘటనగా చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన పది మంది మహిళలు శబరిమలకి వెళ్లాలని ప్రయత్నించినప్పుడు పోలీసులు అడ్డుకున్నట్లుగా ‘Mathrubhumi’ పత్రిక వారి నవంబర్ 16, 2019 కథనం ద్వారా తెలుస్తుంది.
పోస్టులో ఉన్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అది ‘Puthiya Thalaimurai’ వారు డిసెంబర్ 24, 2018న ప్రచురించిన కథనం లో లభించింది. ఆ ఆర్టికల్ ద్వారా, పోస్టులోని ఫోటో శబరిమలకి వెళ్లాలని ప్రయత్నించిన పదకొండు మంది తమిళనాడు మహిళలను పోలీసులు అడ్డుకున్నప్పటిదని తెలిసింది.

ఆ ఫోటోలోని మహిళలు తమిళనాడుకు చెందిన ఒక సంస్థ కి సంబంధించిన మహిళలని ‘Sakshi’ వారి కథనం లో కూడా చూడవచ్చు. ఈ మహిళల బృందం తమిళనాడు కు చెందిన మణితి స్వచ్ఛంద సంస్థ కి చెందిందని అప్పట్లోనే చాలా పత్రికలు రాసాయి.
చివరగా, ఫోటో 2018లో తమిళనాడుకి చెందిన పదకొండు మంది మహిళలు శబరిమలకి వెళ్లాలని ప్రయత్నించినప్పుడు పోలీసులు అడ్డుకున్నప్పటిది.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: ఫోటో 2018లో తమిళనాడుకి చెందిన పదకొండు మంది మహిళలు శబరిమలకి వెళ్లాలని ప్రయత్నించినప్పుడు పోలీసు