Fake News, Telugu
 

ఈ మునిగిపోయిన ఇళ్ల ఫోటోని తెలంగాణలో తీసారు, అమరావతి (ఆంధ్రప్రదేశ్) లో కాదు

0

డబల్ బెడ్రూమ్ హౌస్ విత్ అటాచ్డ్ స్విమ్మింగ్ పూల్. ఇదీ చంద్రన్న కట్టిన రాజధాని’ అని చెప్తూ, నీటిలో మునిగిపోయిన ఇళ్ల ఫోటోని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: చంద్రబాబు కట్టిన రాజధాని అమరావతిలో నీట మునిపోయిన ఇళ్ల ఫోటో.

ఫాక్ట్: ఈ ఫోటోకీ, ఆంధ్రప్రదేశ్ లోని అమరావతికి ఎటువంటి సంబంధంలేదు. ఈ ఫోటో తాజాగా తెలంగాణలో పడిన వర్షాలకి భద్రాద్రి జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి వరద నీళ్ళు వచ్చినప్పుడు తీసిది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని ఫోటో గురించి ఇంటర్నెట్ లో వెతకగా, అదే ఫోటోని ‘V6 Velugu’ మీడియా సంస్థ వారు తమ ఫేస్బుక్ పేజీలో షేర్ చేసినట్టు తెలుస్తుంది. ఆ ఫోటో వివరణలో – ‘భద్రాద్రి జిల్లా : చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో నీటమునిగిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు’, అని రాసినట్టు చదవొచ్చు.

ఈనాడు’, ‘ఆంధ్రజ్యోతి’ మరియు ‘న్యూస్ 18 – తెలుగు’ వారు కూడా పోస్ట్ లోని ఫోటోని తెలంగాణలోని భద్రాద్రి జిల్లా లో తీసినట్టు ప్రచురించారు.

అంతేకాదు, ఆ ఇళ్ల ముందు నిల్చొని అక్కడి పరిస్థితిని వివరిస్తున్న కొందరి వ్యక్తుల వీడియోలను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, పోస్ట్ లోని నీట మునిగిన ఇళ్ల ఫోటో ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి లో తీసినది కాదు. అది తెలంగాణకి సంబంధించిన ఫోటో.

Share.

About Author

Comments are closed.