Fake News, Telugu
 

ఈ ఫొటోలో కనిపిస్తున్న కాకతీయుల నాటి శివలింగం పదేళ్ల క్రితం తవ్వకాల్లో బయటపడింది, ఇటీవల కాదు

0

“నల్లమల్ల అడవుల్లో తవ్వకాల్లో బయటపడ్డ అతి పవిత్రమైన శివలింగం…” అని చెప్తూ ఒక భారీ శివలింగం చుట్టూ కొందరు గుమిగూడి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

క్లెయిమ్: ఇటీవల నల్లమల్ల అడవుల్లో తవ్వకాల్లో బయటపడిన శివలింగం యొక్క ఫొటో. 

ఫాక్ట్(నిజం): వాస్తవానికి ఈ శివలింగం జూన్ 2013లో అప్పటి నల్గొండ (ఇప్పుడు యాదాద్రి భువనగిరి) జిల్లాలో ఉన్న రాచకొండ కోట పరిసరాల్లో జరిగిన తవ్వకాల్లో బయటపడింది. ఇది రాచకొండ అటవీ ప్రాంతంలో ఉంది. కావున ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. 

పోస్టులో చేస్తున్న క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు పరిశీలించటానికి, తగిన కీ వర్డ్స్ ఉపయోగించి పురాతనమైనది అని చెప్తున్న ఈ శివలింగం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, దీనికి సంబంధించి 2013లో ప్రచురితమైన వార్తా కథనాలు కొన్ని లభించాయి (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). వీటి ప్రకారం 2013లో, అప్పటి నల్గొండ (ఇప్పుడు యాదాద్రి భువనగిరి)జిల్లాలోని రాచకొండ కోటికి దగ్గరగా ఉన్న ఒక కొండని కొందరు వ్యక్తులు తవ్వగా, ఈ ఆరు అడుగుల పొడవైన శివలింగం బయటపడింది. నిధుల వేటలో ఈ తవ్వకాలు జరిపినట్లు వార్త కథనాలు పేర్కొన్నాయి (ఇది కూడా చదవండి). ఇది రాచకొండ అటవీ ప్రాంతంలో ఉంది.

హన్స్ ఇండియా వారి కథనం ప్రకారం ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడికి చేరుకున్న పురావస్తు మరియు రెవెన్యూ అధికారులు, ఈ శివలింగం కాకతీయుల కాలం నాటిదని తెలిపారు. 

ఇంకా, ఈ శివలింగన్ని ఇప్పుడు రాచకొండ కొండల దగ్గర ఒక ప్రాంతంలో ఉంచి పూజలు జరిపిస్తున్నట్లు యూట్యూబ్లో ఉన్న అనేక వీడియోలో సూచుస్తున్నాయి (ఇక్కడ మరియు ఇక్కడ). 

చివరిగా, ఈ ఫొటోలో కనిపిస్తున్న కాకతీయుల కాలం నాటి శివలింగం పదేళ్ల  క్రితం తవ్వకాల్లో బయటపడింది, ఇటీవల కాదు

Share.

About Author

Comments are closed.

scroll