Fake News, Telugu
 

AI (ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్) ద్వారా తయారుచేయబడ్డ చిత్రాల్ని యేసు క్రీస్తు తన సహోదరులతో దిగిన చిత్రాలని షేర్ చేస్తున్నారు

0

“క్రిస్మస్ సందర్భంగా యేసు చిన్ననాటి నుండి 30 ఏళ్ల వరకు వివిధ కాలాలలో సోదరులతో కూడియున్న యేసు ఫోటోలను, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇజ్రాయిల్ (Israel Antiquities Authority, IAA), మరియు నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇజ్రాయిల్ (Israel Museum, IM) సంయుక్తంగా విడుదల చేశాయి” అని చెప్తున్న పోస్టు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంట్లో ఎంత నిజముందో తెలుసుకుందాం.

క్లెయిమ్: యేసు క్రీస్తు తన సోదరులతో దిగిన ఫోటోలు.

ఫాక్ట్ (నిజం): ఇజ్రాయిల్ యాంటిక్విటీస్ అథారిటీ వారు కానీ, ఇజ్రాయిల్ మ్యుజీయం వారు కానీ, ఈ పోస్టులో ఉన్న ఫోటోలను విడుదల చేయలేదు. ఈ ఫోటోలు AI (ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్) లేదా కృత్రిమ మేధస్సు ద్వారా తయారు చేయబడ్డాయి. వీటిని వియర్డ్ డాల్ఈ అనే సబ్-రెడిట్ లో ఒక యూసర్ పోస్ట్ చేసారు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఇజ్రాయిల్ యాంటిక్విటీస్ అథారిటీ మరియు ఇజ్రాయిల్ మ్యుజీయం వారు ఈ ఫోటోలని  విడుదల చేసారా అని తెలుసుకోవడానికి సంబంధిత కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, అసలు ఈ ఫోటోలను వారు విడుదల చేసినట్లు ఎటువంటి వార్త కథనాలు మాకు లభించలేదు. వాటి గురించి మరింత సమాచారం కోసం ఫోటోలను యాండెక్స్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఇవి ‘వియర్డ్ డాల్ఈ’  సబ్-రెడిట్ లో లభించాయి. పోస్టులో ఉన్న అదే ఫోటో కొలాజ్ ఇది, దీన్ని ఇక్కడ చూడవచ్చు. u/stovis అనే రెడిట్ యూసర్ సెప్టెంబర్ 28వ తారీఖున వీటిని పోస్టు చేసారు.

ఇవే చిత్రాలు  ‘వియర్డ్ డాల్ఈ’ వారు తమ ట్విట్టర్ హ్యండిల్‌లో కుడా సెప్టెంబర్ 29న పోస్టు చేసారు. వియర్డ్ ఏఐ జెనరేషన్స్’ అనే ఈ ట్విట్టర్ హ్యండిల్‌లో  ఏఐ (అనగా ‘ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్స్’) లేదా కృతిమ మేధస్సు ద్వారా తయారు చేసిన ఆర్టువర్క్ ఫోటోలను అప్లోడ్ చేస్తారు (ఇక్కడ మరియు ఇక్కడ). వారి సబ్-రెడిట్ లో యూజర్లు పోస్టు చేసిన ఆర్టువర్క్ ని కూడా పోస్టు చేస్తారు. అలాగే  u/stovis చేసిన ఈ ‘జీసస్ యాస్ ఏ మెంబెర్ అఫ్ బీ జీస్’ అనే ఫోటోలను కూడా అప్లోడ్ చేసారు. ఈ ఫోటో కొలాజ్ కింద కామెంట్స్ లో ఒక యూసర్ ఈ చిత్రాలని ఏ  ‘ఏఐ జనరేటర్’ ఉపయోగించి చేసారు అని అడగగా u/stovis ‘స్టేబుల్ డిఫ్యూషన్’ అని సమాధానం ఇచ్చారు.

‘ఏఐ జనరేటర్’ అంటే ఏమిటి?

‘ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్’ ఉపయోగించి ‘ఏఐ జనరేటర్’ వెబ్సైట్లు  టెక్స్ట్ డిస్క్రిప్షన్ కమాండ్ గా తీస్కొని దాన్ని ఫొటోలుగా మారుస్తాయి. ఇలా ఉన్న కొన్ని  ‘ఏఐ జనరేటర్స్’ పేర్లు ఇక్కడ చూడవచ్చు. u/stovis ‘స్టేబుల్ డిఫ్యూషన్’ అనే ‘ఏఐ జనరేటర్’ ఉపయోగించి ఈ ఫోటోలు తయారుచేసారు. ‘జీసస్ యాస్ ఏ మెంబెర్ అఫ్ బీ జీస్ ’ అని టెక్స్ట్ రాసి ఈ వెబ్సైటులో మేము కుడా కొన్ని ఫోటోలు జెనెరేట్ చేసాము, వాటిని కింద చూడవచ్చు.

బీ జీస్ఒక ప్రముఖ మ్యూజిక్ గ్రూప్ పేరు, 1960లలో వీరు బాగా ప్రఖ్యాతి పొందారు. ‘బ్యారీ, రాబిన్ మరియు మారిస్ గిబ్’ అనే ముగ్గురు అన్నదమ్ములు ఈ గ్రూప్ ని 1958లో మొదలుపెట్టారు. వీరి చిత్రాలను మరియి వీరి గురించి మరింత సమాచారం ‘బీ జీస్యొక్క అధికారిక వెబ్సైటులో మీరు చూడవచ్చు. వీరి పాపులర్ పాటల్లో ఒకటైన ‘స్టేయిన్గ్ అలైవ్’ అనే పాటని మీరు ఇక్కడ చూడవచ్చు. యేసు క్రీస్తు ఒకవేళ ఈ గ్రూప్ మెంబెర్ అయితే కనుక ఎలా ఉంటుంది అని ‘ఏఐ’ ద్వారా తయారు చేయబడ్డ ఆర్టుని వైరల్ పోస్టులో యేసు క్రీస్తు తన సహోదరులతో దిగిన చిత్రాలని తప్పుగా షేర్ చేస్తున్నారు.

చివరిగా, AI (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) ద్వారా తయారుచేయబడ్డ చిత్రాల్ని యేసు క్రీస్తు తన సహోదరులతో  దిగిన చిత్రాలని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll