Fake News, Telugu
 

పాకిస్థాన్ మసీదుకి సంబంధించిన ఫోటోని అజ్మీర్ దర్గాకు వచ్చిన ఆదాయాన్ని ముస్లింలు లెక్కిస్తున్న చిత్రమంటూ షేర్ చేస్తున్నారు

0

అజ్మీర్ దర్గాలో హిందువులు వేసిన డబ్బుని ముస్లింలు లెక్కిస్తున్న చిత్రం, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: అజ్మీర్ దర్గాలో హిందువులు దానం చేసిన డబ్బులని లెక్కిస్తున్న చిత్రం.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో పాకిస్థాన్ దేశానికి సంబంధించింది. లాహోర్ నగరంలోని డేటా దర్బార్ మసీదుకి వచ్చిన ఆదాయాన్ని లెక్కిస్తున్న దృశ్యాన్ని ఈ ఫోటోని చూపిస్తుంది. ఈ ఫోటోకి అజ్మీర్ దర్గాకు ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని ఒక ట్విట్టర్ యూసర్ 2015లో షేర్ చేసినట్టు తెలిసింది. లాహోర్ నగరంలోని డేటా దర్బార్ మసీదులో పనివాళ్ళు మసీదు చారిటి ఆదాయాన్ని లెక్కిస్తున్న దృశ్యమని ఈ ట్వీట్లో తెలిపారు.

ఆ ఫోటోకి సంబంధించిన అధికారిక సమాచారం కోసం వెతికితే, ఇదే ఫోటోని పాకిస్థాన్ దేశానికి చెందిన ‘Quaid TV’ వెబ్సైట్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ ఫోటో లాహోర్‌లోని డేటా దర్బార్ మసీదుకి సంబంధించిందని ఈ వెబ్సైటులో స్పష్టంగా తెలిపారు. డేటా దర్బార్ మసీదు ఆదాయాన్ని లెక్కిస్తున్నప్పుడు తీసిన మరొక ఫోటోని ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటోకు అజ్మీర్ మసీదుకి ఎటువంటి సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. 

చివరగా, పాకిస్థాన్ మసీదుకి సంబంధించిన ఫోటోని అజ్మీర్ దర్గాకు వచ్చిన ఆదాయాన్ని ముస్లింలు లెక్కిస్తున్న చిత్రమంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll