నాథురాం గాడ్సే గాంధీని కాల్చి చంపినప్పుడు తీసిన ఫోటో అని ఉన్న ఒక పేపర్ క్లిప్ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులోని నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: గాంధీని గాడ్సే చంపినప్పుడు తీసిన అరుదైన ఫోటో.
ఫ్యాక్ట్ (నిజం): ఈ ఫోటో ‘నైన్ అవర్స్ టు రామ (1963)’ అనే సినిమాకి సంబంధించిన స్టిల్. గాంధీని చంపినప్పటిది కాదు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
పోస్టులో ఉన్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా దానికి దెగ్గరగా ఉన్న ఒక ఫోటో ఒకటి జాగరణ్ వారి ఆర్టికల్ లో లభించింది. ‘మహాత్మా గాంధీ హత్యపైన తీసిన మొదటి సినిమాలో గాడ్సేగా ఒక ఇంగ్లీష్ అతను నటించాడు’ అనేది దాని శీర్షిక. 1962లో విడుదలైన ఈ సినిమా పేరు ‘నైన్ హవర్స్ టు కిల్’ అని ఉంది.

ఈ ఆధారాలతో ఇంటర్నెట్ లో వెతుకగా shutterstock.com లో వైరల్ పోస్టులో ఉన్న ఫోటో లభించింది. ఫోటో కింద ‘1962-నైన్ హావర్స్ టు రామ’ అని రాసి ఉంది. IMDB ప్రకారం ‘నైన్ హావర్స్ టు రామ’ 1963లో విడుదలైంది, హోర్స్ట్ బుచోల్జ్ అనే నటుడు నాథురాం గాడ్సేగా నటించాడు.

అందులోని ఫోటో లిస్ట్ లో గాడ్సే గాంధీ వైపు తుపాకీ చూపిస్తూ నుంచున్న ఒక ఫోటోని ఇక్కడ చూడవచ్చు (ఇదే ఫోటో జాగరణ్ వారి ఆర్టికల్ లో కూడా ఉంది). నైన్ హావర్స్ టు రామ చిత్రంలోని క్లైమాక్స్ లో వచ్చే ఈ సన్నివేశాన్ని ఇక్కడ చూడవచ్చు (పూర్తి సినిమా). వైరల్ ఫోటోలో ఉన్న నటీనటులు ఈ సన్నివేశంలో ఉన్న నటీనటుల మధ్య పోలికను కింద ఫొటోలో చూడవొచ్చు.

నాథురాం గాడ్సే గాంధీని 30 జనవరి 1948న తుపాకీతో కాల్చి చంపాడు. గాడ్సే అసలు ఫోటోని ఈ ఆర్టికల్ లో చూడవచ్చు.

చివరిగా, ‘నైన్ హావర్స్ టు రామ’ సినిమాకి సంబంధించిన ఫోటోని నాథురాం గాడ్సే గాంధీని చంపినప్పుడు తీసిన ఫోటో అని తప్పుగా షేర్ చేస్తున్నారు.