Fake News, Telugu
 

పాకిస్థాన్, గాజా ఫోటోలను భారత్‌లో జరిగిన గోవధ ఫోటోలుగా షేర్ చేస్తున్నారు

0

గోవధ చేసే వాడిదగ్గర అంత డబ్బెక్కడిది. నువ్వు వాడిదగ్గర పూలు, పండ్లు, కూరగాయలు కొనటం మూలనే. ఈ పాపంలో భాగస్వామ్యం నీక్కూడా ఉంది. #JagoSecularHindu #SaveGomatha #BanBeef”, అని చెప్తూ రెండు ఫోటోలతో కూడిన పోస్ట్‌ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. పోస్ట్‌లోని ఫోటోలు ఎక్కడివో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారతదేశంలో జరిగిన గోవధకి సంబంధించిన ఫోటోలు.

ఫాక్ట్: పోస్ట్‌లోని రెండు ఫోటోలు భారతదేశానికి సంబంధించినవి కావు. ఒక ఫోటోని 2008లో పాకిస్థాన్‌లో తీస్తే, మరొక ఫోటోని 2015లో గాజాలో తీసారు. కావున, పోస్ట్‌లో భారతదేశానికి సంబంధంలేని పాత ఫోటోలను పోస్ట్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

ఫోటో 1:

ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, ‘Alamy’ స్టాక్ ఫోటో వెబ్‌సైట్‌ యొక్క లింక్ సెర్చ్ రిజల్ట్స్‌లో వస్తుంది. ఆ ఫోటోని 2008లో పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో తీసినట్టు ‘Alamy’ వెబ్‌సైట్‌లో చదవొచ్చు. ఫోటోకి సంబంధించిన వివరాలను ‘రాయిటర్స్’ వెబ్‌సైట్‌లో కూడా చూడవొచ్చు. కాబట్టి, ఫోటో భారతదేశానికి సంబంధించింది కాదు.

ఫోటో 2:

ఇదే ఫోటోని ‘డైలీ మెయిల్’ వారు 2015లో ప్రచురించిన ఒక అర్టికల్‌లో చూడవొచ్చు. ఆ ఫోటోని గాజాలోని రాఫా ప్రాంతంలో తీసినట్టు అర్టికల్‌లో చదవొచ్చు. ఫోటోకి సంబంధించిన వివరాలను ‘APA Images’ వెబ్‌సైట్‌లో కూడా చూడవొచ్చు. ఈ ఫోటో కూడా భారతదేశానికి సంబంధించింది కాదు.

భారత్‌లో జరిగిన గోవధకి సంబంధించిన కొన్ని పాత ఫోటోలను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, పాకిస్థాన్ మరియు గాజాకి సంబంధించిన ఫోటోలను భారతదేశంలో జరిగిన గోవధకి సంబంధించిన ఫోటోలుగా షేర్ చేస్తున్నారు.

Share.

Comments are closed.

scroll