“గోవధ చేసే వాడిదగ్గర అంత డబ్బెక్కడిది. నువ్వు వాడిదగ్గర పూలు, పండ్లు, కూరగాయలు కొనటం మూలనే. ఈ పాపంలో భాగస్వామ్యం నీక్కూడా ఉంది. #JagoSecularHindu #SaveGomatha #BanBeef”, అని చెప్తూ రెండు ఫోటోలతో కూడిన పోస్ట్‌ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. పోస్ట్‌లోని ఫోటోలు ఎక్కడివో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.
క్లెయిమ్: భారతదేశంలో జరిగిన గోవధకి సంబంధించిన ఫోటోలు.
ఫాక్ట్: పోస్ట్‌లోని రెండు ఫోటోలు భారతదేశానికి సంబంధించినవి కావు. ఒక ఫోటోని 2008లో పాకిస్థాన్‌లో తీస్తే, మరొక ఫోటోని 2015లో గాజాలో తీసారు. కావున, పోస్ట్‌లో భారతదేశానికి సంబంధంలేని పాత ఫోటోలను పోస్ట్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
ఫోటో 1:
ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, ‘Alamy’ స్టాక్ ఫోటో వెబ్‌సైట్ యొక్క లింక్ సెర్చ్ రిజల్ట్స్‌లో వస్తుంది. ఆ ఫోటోని 2008లో పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో తీసినట్టు ‘Alamy’ వెబ్‌సైట్‌లో చదవొచ్చు. ఫోటోకి సంబంధించిన వివరాలను ‘రాయిటర్స్’ వెబ్‌సైట్‌లో కూడా చూడవొచ్చు. కాబట్టి, ఫోటో భారతదేశానికి సంబంధించింది కాదు.
ఫోటో 2:
ఇదే ఫోటోని ‘డైలీ మెయిల్’ వారు 2015లో ప్రచురించిన ఒక అర్టికల్‌లో చూడవొచ్చు. ఆ ఫోటోని గాజాలోని రాఫా ప్రాంతంలో తీసినట్టు అర్టికల్‌లో చదవొచ్చు. ఫోటోకి సంబంధించిన వివరాలను ‘APA Images’ వెబ్‌సైట్‌లో కూడా చూడవొచ్చు. ఈ ఫోటో కూడా భారతదేశానికి సంబంధించింది కాదు.
భారత్‌లో జరిగిన గోవధకి సంబంధించిన కొన్ని పాత ఫోటోలను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు.
చివరగా, పాకిస్థాన్ మరియు గాజాకి సంబంధించిన ఫోటోలను భారతదేశంలో జరిగిన గోవధకి సంబంధించిన ఫోటోలుగా షేర్ చేస్తున్నారు.