Fake News, Telugu
 

ఈ లిస్టులో ఉన్న కొందరు మాత్రమే యాకుబ్ మెమొన్ ఉరి శిక్ష రద్దు చేయాలని రాష్ట్రపతికి లేఖలు రాసారు

0

యాకుబ్ మెమన్ ఉరి ఆగిపోవాలని రాష్ట్రపతికి లేఖలు రాసిన భారత నలభై మంది వ్యక్తుల పెర్లంటూ ఒక 40 మంది పేర్ల లిస్ట్ షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: యాకుబ్ మెమన్ ఉరి ఆగిపోవాలని రాష్ట్రపతికి లేఖలు రాసిన నలభై మంది వ్యక్తుల పేర్ల లిస్ట్.

ఫాక్ట్ (నిజం): 1993 ముంబై బాంబు పేలుళ్ళ కేసులో ఉరికి సంబంధించి క్షమాభిక్ష కోరుతూ యాకుబ్ మెమన్ రాష్ట్రపతికి లేఖ రాయగా, ఈ లేఖను పరిగణలోకి తీసుకొని తన ఉరి రద్దు చేయాలంటూ అప్పట్లో దేశంలోని కొందరు ప్రముఖలు రాష్ట్రపతికి లేఖలు రాసారు. ఐతే పోస్టులో చెప్తున్న 40 మంది లిస్టులో కేవలం ఎనిమిది మందే ఆ లేఖలు రాసారు. ప్రకాష్ కారత్, శత్రుఘ్న సిన్హా, నసీరుద్దిన్ షా మొదలైన వారు లేఖలు రాయగా, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, సచిన్ పైలట్ మొదలైన వారు లేఖలు రాసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

1993 ముంబై బాంబు పేలుళ్ళ కేసులో కోర్ట్ యాకుబ్ మెమన్ కు ఉరి శిక్ష విధించింది. ఉరి శిక్ష రద్దు చేయాలని యాకుబ్ మెమొన్ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరాడు. ఐతే ఉరి శిక్ష రద్దు విషయంలో యాకుబ్ మెమొన్ క్షమాభిక్ష అభ్యర్ధనని పరిగణలోకి తీసుకొని తన ఉరి రద్దు చేయాలంటూ అప్పట్లో దేశంలోని కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు, న్యాయవాదులు, సినిమా ఇండస్ట్రీ కి చెందిన వారు, సామాజిక కార్యకర్తలు మొదలైన వారు రాష్ట్రపతికి లేఖలు రాసారు.

ఇలా లేఖలు రాసినవారిలో సిపిఎం కి చెందిన ప్రకాష్ కారత్, సీతారాం ఏచూరి, శత్రుఘ్న సిన్హా (మాజీ బీజేపీ ఎంపీ), ప్రముఖ న్యాయవాదులు రామ్ జెత్మలాని (మాజీ బీజేపీ ఎంపీ) , ప్రశాంత్ భూషణ్, నటుడు నసీరుద్దిన్ షా మొదలైన వారున్నారు. ఈ విషయానికి సంబంధించి అనేక వార్తా కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. ఐతే యాకుబ్ మెమొన్ క్షమాభిక్ష అభ్యర్దన పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హోం మంత్రి అభిప్రాయం కోరిన తరవాత తిరస్కరించారు. ఆ తరవాత 29 జూలై 2015లో యాకుబ్ మెమొన్ ని ఉరి తీసారు.

ఐతే పోస్టులో చెప్తున్న యాకుబ్ మెమొన్ క్షమాభిక్ష అభ్యర్దన పై రాష్ట్రపతికి లేఖలు రాసిన వారి లిస్టులో చాలా మంది నిజానికి ఇలా లేఖలు రాసినట్టు ఎటువంటి వార్తా కథనాలు గాని లేక ఇతర సమాచారం గాని లేవు. ఈ 40 మంది లిస్టులో కేవలం ఎనిమిది మంది (బృందా కారత్, ప్రకాష్ కారత్, శత్రుఘ్న సిన్హా, రామ్ జెత్మలాని, ప్రశాంత్ భూషణ్, నసీరుద్దిన్ షా, రాహుల్ రాయ్, మహేష్ భట్) మాత్రమే లేఖలు రాసారు. పోస్టులో పేర్కొన్న ఇతరులు (షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సచిన్ పైలట్, మొదలైన వారు) లేఖలు రాసినట్టు ఎటువంటి వార్తా కథనాలు లేవు, ఒకవేళ నిజంగానే వీరు లేఖలు రాసుంటే ఈ విషయం వార్తా కథనాలు ప్రచురించేవి, కానీ అలాంటి కథనాలు ఏవి లేవు.

యాకుబ్ మెమొన్ ఉరిని వ్యతిరేకిస్తూ సల్మాన్ ఖాన్ ట్వీట్ చేసినప్పటికీ, సల్మాన్ ఖాన్ రాష్ట్రపతికి లేఖ రాసినట్టు ఎటువంటి కథనాలు లేవు. ఐతే తరవాత సల్మాన్ ఖాన్ తన ట్వీట్ కి సంబంధించి క్షమాపణలు కూడా చెప్పాడు.

చివరగా, ఈ లిస్టులో ఉన్న కొందరు మాత్రమే యాకుబ్ మెమొన్ ఉరి శిక్ష రద్దు చేయాలని రాష్ట్రపతికి లేఖలు రాసారు.

Share.

About Author

Comments are closed.

scroll