Fake News, Telugu
 

వీడియోలో ఉన్నది బిజెపి నేత ఇనాయత్ హుస్సేన్ కాదు. వీడియోలోని ఘటనకీ, CAA నిరసనలకు ఎటువంటి సంబంధం లేదు

0

ఒక వీడియో ని ఫేస్బుక్ లో పెట్టి, ‘NRC, CAA మరియు NPR లకు బహిరంగంగా మద్దతు ఇచ్చినందుకు ఇండోర్ బిజెపి నేత మరియు మాజీ హజ్ కమిటీ చైర్మన్ ఇనాయత్ హుస్సేన్ కు ముఖం మీద మసిపూసి చెప్పులతో మరియు బూట్లతో కొట్టుకుంటూ బయటికి తీసుకు వచ్చిన స్థానిక ప్రజలు’ అని దాని గురించి చెప్తున్నారు. పోస్టులో వీడియో గురించి చెప్పినదాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: NRC, CAA మరియు NPR లకు బహిరంగంగా మద్దతు ఇచ్చినందుకు ఇండోర్ బిజెపి నేత మరియు మాజీ హజ్ కమిటీ చైర్మన్ ఇనాయత్ హుస్సేన్ పై స్థానిక ప్రజలు దాడి చేయడానికి సంబంధించిన వీడియో. 

ఫాక్ట్ (నిజం): వీడియో అజ్మీర్ దర్గా లో ఖాదీంలకు సంబంధించిన ‘అంజుమన్ షేక్ జాద్గాన్’ సంస్థ యొక్క సెక్రటరీ ‘అబ్దుల్లా మజీద్ చిస్తీ’ పై జరిగిన దాడికి సంబంధించినది. కావున, ఆ వీడియోలో దాడికి గురైన వ్యక్తి ఇండోర్ బిజెపి నేత మరియు మాజీ హజ్ కమిటీ చైర్మన్ ‘ఇనాయత్ హుస్సేన్’ కాదు. అంతేకాదు, వీడియోలోని ఘటన మార్చి 2018 లో జరిగింది. కావున, పోస్టులో చెప్పింది తప్పు.

పోస్టులోని వీడియోకి సంబంధించిన స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఒక స్క్రీన్ షాట్ ‘Voice of Chambal’ వార్తా సంస్థ  ఆర్టికల్ లో కనుగొనబడింది. ఆ కథనం ద్వారా, అజ్మీర్ దర్గా లో ఖాదీంలకు సంబంధించిన ‘అంజుమన్ షేక్ జాద్గాన్’ సంస్థ యొక్క సెక్రటరీ ‘అబ్దుల్లా మజీద్ చిస్తీ’ పై షేక్ బంటీ అనే వ్యక్తి దాడి చేయడానికి సంబంధించిన వీడియో అని తెలిసింది. కావున, ఆ వీడియోలో దాడికి గురైన వ్యక్తి  ఇండోర్ బిజెపి నేత మరియు మాజీ హజ్ కమిటీ చైర్మన్ ‘ఇనాయత్ హుస్సేన్’ కాదు. అంతేకాదు, ఆ కథనం ద్వారా  వీడియోలోని ఘటన మార్చి 2018 లో జరిగిందని తెలిసింది. ఆ వీడియోకి సంబంధించిన మరింత సమాచారం ‘Patrika’ వారు ఆ ఘటన గురించి రాసిన న్యూస్ రిపోర్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. కావున, ఆ వీడియోలోని ఘటనకీ, ప్రస్తుతం జరుగుతున్న NRC, CAA నిరసనలకు ఎటువంటి సంబంధం లేదు.

చివరగా, సంబంధం లేని వీడియోని పెట్టి, ‘NRC, CAA మరియు NPR లకు బహిరంగంగా మద్దతు ఇచ్చినందుకు ఇండోర్ బిజెపి నేత ఇనాయత్ హుస్సేన్ పై దాడి’ అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll