Fake News, Telugu
 

వీడియోలో రాజాసింగ్ ని అరెస్ట్ చేస్తున్నది గత సంవత్సరం హైదరాబాద్ లో, తాజాగా భైంసాలో కాదు

0

భైంసలో జరిగి అల్లర్ల గురించి తెలుసుకోవడానికి వచ్చిన బీజేపీ ఎంఎల్ఏ రాజాసింగ్ కు తెలంగాణ పోలీసులు ఇచ్చిన గౌరవం చూడండి అంటూ ఒక వీడియోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: భైంసలో జరిగి అల్లర్ల గురించి తెలుసుకోవడానికి వచ్చిన బీజేపీ ఎంఎల్ఏ రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేస్తున్న వీడియో. 

ఫాక్ట్ (నిజం): హైదరాబాద్ లోని అంబర్ పేట్ ప్రాంతంలో ఒక మసీదు నిర్మాణం పై బీజేపీ ఎంఎల్ఏ రాజాసింగ్ నిరసన తెలుపుతుండగా, మే-2019 లో తెలంగాణ పోలీసులు తనని అరెస్ట్ చేస్తున్నప్పటి వీడియో అది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అలాంటి చాలా వీడియోలు సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. యూట్యూబ్ లో అదే వీడియోని మే-2019 లోనే (‘Bjp mla rajasing arrest హైదరాబాద్.. అంబర్ పేటలో అక్రమంగా రోడ్డుపై జరుగుతున్న మసీదు నిర్మాణాన్ని’ అనే టైటిల్ తో) అప్లోడ్ చేసినట్టుగా చూడవొచ్చు. అంతేకాదు, అదే వీడియోని బీజేపీ ఎంఎల్ఏ రాజాసింగ్ కూడా తన ట్విట్టర్ ప్రొఫైల్ లో మే-2019 లోనే ట్వీట్ చేసినట్టు చూడవొచ్చు. ఆ ఘటనకి సంబంధించి రాజాసింగ్ ట్వీట్ చేసిన మరికొన్ని ట్వీట్లను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. కావున, తాజాగా భైంసాలో జరిగిన అల్లర్లకూ, పోస్టులోని వీడియోకి అసలు సంబంధం లేదు.

చివరగా, వీడియోలో రాజాసింగ్ ని అరెస్ట్ చేస్తున్నది గత సంవత్సరం హైదరాబాద్ లో, తాజాగా భైంసాలో కాదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll