Fake News, Telugu
 

పాత వీడియోని ఇటీవల వర్షాలకు హిమాయత్ సాగర్ లో ప్రత్యక్షమైన మొసలిది అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు

0

ఇటీవలే హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్ చెరువులో మొసలి ప్రత్యక్షమైందని చెప్తు దీనికి సంబంధించిన వీడియో షేర్ చేసిన చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇటీవలే హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్ చెరువులో మొసలి ప్రత్యక్షమైన వీడియో.

ఫాక్ట్(నిజం): పోస్టులో ఉన్న వీడియో లాంటిదే ఒక వీడియో యూట్యూబ్ లో 08 ఫిబ్రవరి 2018న అప్లోడ్ చేయబడి ఉంది. దీన్నిబట్టి ఈ వీడియో పాతదని, ఈ వీడియోకి ఇటీవల హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు సంబంధంలేదని కచ్చితంగా చెప్పొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో ఉన్న వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా పోస్టులో వీడియో లాంటిదే ఒక వీడియో యూట్యూబ్ లో మాకు కనిపించింది. ఈ వీడియో 08 ఫిబ్రవరి 2018న అప్లోడ్ చేయబడింది. ఈ వీడియో వివరణ ప్రకారం ఈ వీడియో పశ్చిమ బెంగాల్ లోని ఫరక్కా బ్యారేజ్ దగ్గర గంగా నదిలో మొసలి కనిపించినప్పుడు తీసింది.

ఇదే క్లెయిమ్ తో ఉన్న మరికొన్ని యూట్యూబ్ వీడియోస్ మాకు కనిపించాయి. ఐతే ఈ వీడియో ఫరక్కా బ్యారేజ్ దగ్గర తీసిందని చెప్పడానికి మాకు కచ్చితమైన ఆధారాలు దొరకానప్పటికీ ఈ వీడియో అప్లోడ్ చేసిన తేదీ ప్రకారం ఈ వీడియో ఇటీవల హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు సంబంధించించింది కాదని కచ్చితంగా చెప్పొచ్చు.

ఇటీవల హైదరాబాద్ లో విస్తృతంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధంలేని ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ హైదరాబాద్ వర్షాలకు సంబంధించినవి అని చెప్తున్నారు.

చివరగా, పోస్టులో ఉన్న వీడియోకి, ఇటీవల హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు సంబంధంలేదు.

Share.

About Author

Comments are closed.

scroll