బీజేపీ జెండాలను కొంతమంది వ్యక్తులు పట్టుకుని ర్యాలీ చేస్తున్న వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, ఆ ఘటన పాకిస్తాన్ దేశం లో జరిగిందని, అక్కడి ప్రజలు తమ దేశానికి ప్రధానిగా నరేంద్ర మోడీ కావాలని కోరుతూ అలా చేసారని చెప్తున్నారు. కానీ, ‘FACTLY’ విశ్లేషణలో ఆ ఘటన జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ లో జరిగినట్లుగా తెలిసింది. 2019 ఎన్నికల సందర్భంలో అనంతనాగ్ పార్లమెంటరీ నియోజికవర్గం నుండి బీజేపీ తరపున ‘సోఫీ యూసఫ్’ నామినేషన్ వేసిన సందర్బంలో అతని మద్దతుదారులు ఆయనతో పాటు వెళ్ళిన వీడియో అది. గత సంవత్సరం కూడా అదే వీడియో మరొక ఆరోపణతో సోషల్ మీడియా లో చలామణీ అయినప్పుడు, FACTLY రాసిన కథనం ఇక్కడ చూడవచ్చు.
సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. న్యూస్ వీడియో – https://www.youtube.com/watch?v=GWnV-dnSjNo
2. బీజేపీ జమ్మూ కాశ్మీర్ ట్వీట్ – https://twitter.com/BJP4JnK/status/1112310947878625281
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?