Fake News, Telugu
 

చైనా ఇంజనీర్లు ఎకె-47 పట్టుకుని ఉన్న పాత ఫోటోలను పాకిస్తాన్‌లో ఇటీవల జరిగిన పేలుడు తర్వాత తీసిన ఫోటోలని షేర్ చేస్తున్నారు

0

చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న చైనీస్ ఇంజనీర్లు ఈ మధ్య ఎకె-47 పట్టుకొని తిరుగుతున్నారని ఒక పోస్ట్ ద్వారా షేర్ చేస్తున్నారు. మోన్న జులై 14న పాకిస్తాన్ దేశపు ఉగ్రమూకలు చేసిన దాడులకు భయపడి ఎకె-47 మరియు అస్సాల్ట్ రైఫిల్స్‌తోనే తమ పని ప్రదేశాలకు వెళుతున్నారని పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: పాకిస్తాన్‌లో ఇటీవల జరిగిన పేలుడు తరువాత చైనా ఇంజనీర్లు ఎకె-47ను మోస్తున్న ఫోటోలు.

ఫాక్ట్: మొదటి ఫోటో 2020లో ఆఫ్రికాలో తీసినది. రెండొవ ఫోటో 2006 లో పాకిస్తాన్‌లో తీసినది. రెండు ఫోటోలు పాతవి, ఇటీవల తీసినవి కాదు. జూలై 14న పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలోని ఒక నిర్మాణ స్థలానికి తీసుకువెళుతున్న బస్సు పేలుడుకి గురి అయ్యింది. లోయలోకి దూసుకెళ్లడంతో తొమ్మిది మంది చైనీస్, ముగ్గురు పాకిస్తానీలు మరణించగా, మరో 28 మంది గాయపడ్డారు. ఈ సంఘటన జరిగిన వెంటనే చైనీస్ ఎకె-47ను పనికి తీసుకెలుతున్నారన్న కచ్చితమైన సమాచారం మాకు లభించలేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నది.

ఫోటో 1:

మొదటి ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, పాకిస్తాన్ వారి డిఫెన్స్ వెబ్సైటులో ఒక ఫాక్ట్ చెక్ ఆర్టికల్ లభించింది. ఆ వెబ్సైటులో, ఈ యొక్క ఇమేజ్ 2020లో రాసిన ఒక బ్లాగ్‌లోని ఇమేజ్ అని తెలిపింది. ఇండియన్ మీడియాలో ఈ ఫోటోల గురించి వస్తున్న వార్తలు కూడా తప్పని అందులో తెలిపారు. బ్లాగ్‌ను ఓపెన్ చేసినప్పుడు, అది 05 మే 2020 లో పబ్లిష్ చేసినట్టు తెలుస్తుంది. ఫోటోను ఆఫ్రికాలో చైనీస్ ప్రొఫెషనల్స్ ట్రైనింగ్‌కు వెళ్ళినప్పుడు తీసినట్టు తెలిపారు.

ఫోటో 2:

రెండొవ ఫోటోను బింగ్ వెబ్సైటులో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఒక ఫేస్బుక్ పోస్ట్ లభించింది. 31 జులై 2015 లో పబ్లిష్ చేసిన ఈ ఫేస్బుక్ పోస్టులో అదే ఫోటో ఉన్నది. అంటే ఇది ఒక పాత ఫోటో అని అర్ధమవుతుంది. ఈ ఫోటో యొక్క కరెక్ట్ సోర్స్ కనుక్కోటానికి టార్ బ్రౌజరులో బైడు వెబ్సైటు ఓపెన్ చేసి రివర్స్ ఇమేజ్ చేసాము. ఒక వెబ్సైటులో ఫొటో తీసిన వ్యక్తిని ఇంటర్వ్యూ చేసారు, అయితే అతను 2006లో పాకిస్తాన్‌లో ఉన్నప్పుడు తీసినట్టు తెలిపాడు.

జూలై 14న పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలోని ఒక నిర్మాణ స్థలానికి తీసుకువెళుతున్న బస్సు పేలుడుకి గురి అయ్యింది. లోయలోకి దూసుకెళ్లడంతో తొమ్మిది మంది చైనీస్, ముగ్గురు పాకిస్తానీలు మరణించగా, మరో 28 మంది గాయపడ్డారు.

చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ విదేశీ భద్రతా వ్యవహారాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వు వీ నేతృత్వంలోని 15 మంది సభ్యుల బృందానికి పేలుడు ప్రదేశాన్ని పర్యటించినట్టు, దర్యాప్తు గురించి వారికి పాకిస్తానీ అధికారులు వివరించినట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, పాత ఫోటోలను చూపిస్తూ ఇటీవల పాకిస్తాన్‌లో పేలుడు తరవాత చైనీయుల పరిస్థితి అంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll