బెంగాల్ లోని కమ్యూనిస్టుల కంచుకోట మిడ్నపూర్ లో అమిత్ షా బహిరంగ సభకు హజరైన ప్రజలు, అని షేర్ చేస్తున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. బహిరంగ సభలలో భారీగా తరలి వచ్చిన జనాల ఫోటోలు, ఈ పోస్టులలో షేర్ చేసారు. పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్న నేపధ్యంలో, ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: అమిత్ షా పశ్చిమ బెంగాల్ లో ఇటీవల జరిపిన రోడ్ షో కి హాజరైన ప్రజల ఫోటోలు.
ఫాక్ట్ (నిజం): ఈ పోస్టులలో షేర్ చేసిన ఫోటోలు పాతవి. మొదటి ఫోటో 2014లో అమిత్ షా పశ్చిమ బెంగాల్ లో నిర్వహించిన బహిరంగ సభకు సంబంధించినది. మరొక పోస్టులో షేర్ చేసిన ఫోటో కూడా ఇటీవల తీసినది కాదు. ఈ ఫొటోలకి అమిత్ షా ఇటీవల పశ్చిమ బెంగాల్ లో నిర్వహించిన రోడ్ షో లకి సంబంధించినవి కావు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఫోటో-1:
పోస్టులో షేర్ చేసిన ఫోటో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటో ‘Alamy’ వెబ్సైటులో దొరికింది. అమిత్ షా పశ్చిమ బెంగాల్ లో ‘30 నవంబర్ 2014’ నాడు నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన బీజేపీ సపోర్టర్లు, అని ఈ ఫోటో వివరణలో తెలిపారు.
ఈ వివరాల ఆధారంగా ఆ ఫోటోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, పోస్టులోని అదే ఫోటోని షేర్ చేస్తూ ‘Daily Mail’ న్యూస్ వెబ్ సైట్ ‘01 డిసెంబర్ 2014’ పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా ‘30 నవంబర్ 2014’ నాడు పశ్చిమ బెంగాల్ లో నిర్వహించిన బహిరంగ సభకు భారీగా హాజరైన బీజేపీ సపోర్టర్ల ఫోటో, అని ఆర్టికల్ లో తెలిపారు.
‘30 నవంబర్ 2014’ నాడు పశ్చిమ బెంగాల్ లో నిర్వహించిన ఈ బహిరంగ సభకు సంబంధించిన దృశ్యాలని బీజేపీ, అమిత్ షా తమ యూట్యూబ్ ఛానల్ మరియు ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో పాతది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఫోటో-2:
పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధికారిక ‘Flick’ వెబ్ సైట్ అకౌంట్ లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ ఫోటోని నరేంద్ర మోదీ ‘06 ఏప్రిల్ 2018’ లో పోస్ట్ చేసారు. బీజేపీ స్థాపన దినత్సోవం సందర్భంగా బీజేపీ కార్యకర్తలకి శుభాకాంక్షలు తెలుపుతూ, మోది ఈ ఫోటోని పోస్ట్ చేసారు.
ఇదే ఫోటోని కొందరు సోషల్ మీడియా యూసర్లు మరియు న్యూస్ వెబ్ సైట్స్ 2018లో పోస్ట్ చేసారు. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటోకి అమిత్ షా ఇటీవల పశ్చిమ బెంగాల్ లో నిర్వహించిన బహిరంగ సభలకి సంబంధం లేదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, బిజెపి నిర్వహించిన పాత బహిరంగ సభల ఫోటోలని చూపిస్తూ అమిత్ షా పశ్చిమ బెంగాల్ లో ఇటీవలనిర్వహించిన బహిరంగ సభ ఫోటోలని తప్పుగా షేర్ చేస్తున్నారు.