Fake News, Telugu
 

లీప్ ఇయర్ కాని ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఒక వారంలోని అన్ని రోజులు నాలుగు సార్లు వస్తాయి

0

‘రాబోయే ఫిబ్రవరి మీ జీవిత కాలంలో మళ్ళీ రాదుఎందుకంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 4 ఆదివారాలు, 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 బుధవారాలు, 4 వ గురువారాలు, 4 శుక్రవారాలు & 4 శనివారాలు ఉన్నాయి.ఇది ప్రతి 823 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.దీన్ని మనీ బ్యాగ్స్ అంటారు.కాబట్టి కనీసం 5 మందికి లేదా 5 గ్రూపులకు పంపండి మరియు డబ్బు 4 రోజుల్లో వస్తుంది.చైనీస్ ఫెంగ్ షుయ్ ఆధారంగా.చదివిన 11 నిమిషాల్లో పంపండి’  అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఫిబ్రవరి 2021 లో ఒక వారంలోని అన్ని దినాలు నాలుగు సార్లు రావడం (4 ఆది, 4 సోమ, etc). ప్రతి 823 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సంభవించే సంఘటన.

ఫాక్ట్ (నిజం): నెలలో 28 రోజులున్న ఉన్న ప్రతిసారి ఒక వారంలోని అన్ని రోజులు నాలుగు సార్లు వస్తాయి. అంటే ఒక్క లీప్ ఇయర్ లో తప్ప ప్రతి ఏడాది ఫిబ్రవరిలో ఇలా వారంలోని ప్రతీ రోజు నాలుగు సార్లు వస్తాయి (4 ఆది, 4 సోమ, etc). ఇలా కేవలం 823 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందన్న వాదనలో నిజం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఐతే ఇలా ఒక వారంలోని అన్ని రోజులు నాలుగు సార్లు రావడం కొత్తేమి కాదు. నెలలో 28 రోజులున్న ఉన్న ప్రతిసారి ఇలా జరుగుతుంది. లీప్ ఇయర్ కాని సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఒక వారంలోని అన్ని రోజులు నాలుగు సార్లు వస్తాయి, ఎందుకంటే (నెలలోని 28 రోజులు/ 7 (వారం) = 4), అంటే ఖచ్చితంగా నాలుగు వారాలు, ఆ వారాల్లోని అన్ని దినాలు వస్తాయి. ఉదాహరణకి 2019, 2021, 2022, 2023 సంవత్సరాలను గమనిస్తే ఈ సంవత్సరాలలో ఫిబ్రవరి నెలలో ఒక వారంలోని ప్రతీ రోజు నాలుగు సార్లు రావడం (4 ఆదివారాలు, 4 సోమవారాలు,…etc) చూడొచ్చు.

లీప్ ఇయర్ లో 1st ఫిబ్రవరి ఏ రోజవుతుందో ఆ ఒక్క రోజు 5 సార్లు, మిగతావి 4 సార్లు వస్తాయి. ఐతే ఇలా ఫిబ్రవరి నెలలో అన్ని రోజులు నాలుగు సార్లు పునరావృతం కావడం 823 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందన్న వాదనలో నిజం లేదు. లీప్ ఇయర్ కాని సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో అన్ని రోజులు నాలుగు సార్లు వస్తాయి. 

ఐతే ఇలాగే ముందొకసారి డిసెంబర్ నెల మనీ బ్యాగ్ నెల అని చెప్తూ వైరల్ అయిన వార్తని FACTLY తప్పని చెప్పిన కథనం ఇక్కడ చదవొచ్చు.

చివరగా, లీప్ ఇయర్ కాని ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఒక వారంలోని అన్ని రోజులు నాలుగు సార్లు వస్తాయి.

Share.

About Author

Comments are closed.

scroll