Fake News, Telugu
 

సంబంధం లేని పాత ఫోటోలను కంగనా రనౌత్ రక్షణ కోసం వెయ్యి వాహనాలతో బయలుదేరిన కర్ణి సేన అని షేర్ చేస్తున్నారు

0

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రక్షణ కోసం వెయ్యి వాహనాలతో బయలుదేరిన హిందూ కర్ణీ సేన (రాజపుత్రులు), అంటూ షేర్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కంగనా రనౌత్ మహారాష్ట్ర ప్రభుత్వం కు మధ్య జరుగుతున్న ఘర్షణలో, కర్ణి సేన కంగనా రనౌత్ కు తమ మద్దతు ప్రకటించింది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కంగనా రనౌత్ రక్షణ కోసం వెయ్యి వాహనాలతో ముంబై కి బయలేదేరిన హిందూ కర్ణి సేన.

ఫాక్ట్ (నిజం):  పోస్టులో షేర్ చేసినవి దేశంలోని వివిధ ప్రాంతాలలో తీసిన పాత కాన్వాయ్ ఫోటోలు. ఈ ఫొటోలకి  కంగనా రనౌత్ మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో జరుగుతున్న ఘర్షణకి ఎలాంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఫోటో-1:

పోస్టులోని ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సేర్చ్ చేయగా, అదే ఫోటోని షేర్ చేస్తూ ఫేస్బుక్ లో ‘22 డిసెంబర్ 2019’ నాడు పెట్టిన ఒక పోస్ట్ దొరికింది. ఫోటోలో కనిపిస్తున్నది గుజరాత్ రాష్ట్రంలో కర్ణి సేన చేసిన ర్యాలికి సంబంధించినది అని అందులో తెలిపారు. మరొక యూసర్ కూడా ఈ ఫోటోను ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తూ ఇదే విషయాన్నీ తెలిపారు. ఈ ఫోటో గుజరాత్ కి సంబంధించిందని అధికారిక ఆధారాలు దొరకనప్పటికి, పోస్టులోని ఈ ఫోటో పాతది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఫోటో-2:

ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అదే ఫోటోని షేర్ చేస్తూ ఫేస్బుక్ లో  ‘14 జూలై 2020’ నాడు ఒక యూసర్ పెట్టిన పోస్ట్ దొరికింది. ఇదే ఫోటోని 2018లో ఇంకో యూసర్ తన ట్వీట్ లో షేర్ చేసారు. ఈ రెండు పోస్టులలో కూడా ఆ ఫోటో రాజస్తాన్ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ కాన్వాయ్ కి సంబంధించినది అని తెలిపారు. కాని, దానికి సంబంధించి ఎలాంటి అధికారిక ఆధారాలు దొరకలేదు.

ఫోటో-3:

పోస్టులోని ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అదే ఫోటోని షేర్ చేస్తూ ‘05 మార్చ్ 2017’ నాడు పోస్ట్ చేసిన ఒక ట్వీట్ దొరికింది. మరొక ఫేస్బుక్ యూసర్, ఈ ఫోటో ఒక బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన ర్యాలీది అని తెలుపుతూ పోస్ట్ చేసారు. కాని, ఈ ఫోటోకి సంబంధించిన అధికారిక వివరాలు ఏవి దొరకలేదు.

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కి మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఘర్షణలో తమ మద్దతు కంగనా రనౌత్ కి ఉంటుంది అని కర్ణి సేన ’07 సెప్టెంబర్ 2020’ నాడు ప్రకటించింది. ‘09 సెప్టెంబర్ 2020’ నాడు కంగనా రనౌత్ ముంబైకి వస్తున్న నేపధ్యంలో తాము కంగనాకు విమానాశ్రయం నుండి తన ఇంటి వరకు రక్షణగా ఉంటామని కర్ణి సేన ప్రకటించింది. ముంబై నగరాన్ని ‘పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్’ అని పోలుస్తూ కంగనా పెట్టిన ట్వీట్ వల్ల ఈ వివాదం మొదలైంది. ముందుగా ప్రకటించినట్టుగానే కర్ణి సేన కంగనా రనౌత్ రక్షణ ఇవ్వడానికి ముంబై విమానాశ్రయం కి వచ్చారు. ఆ దృశ్యాలని ఇక్కడ చూడవచ్చు. కానీ పోస్టులో పెట్టినా ఏ ఒక్క ఫోటో కూడా దీనికి సంబంధించింది కాదు.

చివరగా, సంబంధం లేని ఫోటోలను చూపిస్తూ కంగనా రనౌత్ రక్షణ కోసం వెయ్యి వాహనాలతో బయలుదేరిన కర్ణి సేన అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll