Fake News, Telugu
 

అమెరికా వెళ్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్ళారు అని ఒక ఎడిటెడ్ ఫోటోని షేర్ చేస్తున్నారు

0

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు అని వస్తున్న వార్తా  కథనాల (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) నేపథ్యంలో, తను సింగపూర్‌లో ఉన్నారు అని చెప్తూ ఒక ఫోటో (ఇక్కడ మరియు ఇక్కడ) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘అమెరికా వెళ్తానని చెప్పి….. సింగపూర్ లో ఏం చేస్తున్నట్టు???’ అని చెప్తూ షేర్ చేయబడుతున్న ఈ ఫోటో వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

దీని ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: సింగపూర్ రోడ్ల పైన తీసిన చంద్రబాబు నాయుడు ఫోటో ఇది. ఆయన అమెరికాకు అని చెప్పి 2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సింగపూర్ వెళ్లారు. 

ఫాక్ట్:  వైరల్ అవుతున్న ఈ ఫోటో ఒక ఎడిటెడ్ ఫోటో. సింగపూర్‌లోని ‘Orchard Road’ షాపింగ్ ఏరియాలో తీసిన ఒక పాత ఫోటోలో చంద్రబాబు నాయుడు ఫోటోని పెట్టి ఎడిట్ చేసి ఈ ఫోటోని తయారు చేసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

ముందుగా, చంద్రబాబు నాయుడు తన పర్యటన గురించి తన సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఇటీవల ఏమైనా ఫోటోలు పోస్టు చేశారా అని చూడగా, అందులో మాకు ఎలాంటి ఫోటోలు, పోస్టులు దొరకలేదు. వైరల్ అవుతున్న ఈ ఫోటో గురించి ఎలాంటి వార్తా కథనాలు కూడా మాకు దొరకలేదు. 

ఇక ఈ ఫోటో గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి, దాన్ని ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఇదే ఫోటో మాకు 2023లో  ‘ఛానల్ న్యూస్ ఏసియా’ అనే వెబ్సైటులో ప్రచురించిన ఒక కథనంలో దొరికింది.’ గ్రేట్ సింగపూర్ సేల్’ లాంటి రిటైల్ ఫెస్టివల్స్, తమ ఉనికి కోల్పోతున్నాయి అని రాసిన ఈ కథనం(ఆర్చైవ్ లింక్) యొక్క హెడర్ ఇమేజ్ వైరల్ అవుతున్న ఫోటో దాదాపుగా ఒకటే, కానీ ఈ ఫోటోలో చంద్రబాబు నాయుడు లేరు. 

ఇంటర్నెట్‌లో ఎప్పటినుండో ఉన్న ఈ ఫోటోని ఇటీవల చంద్రబాబు నాయుడు సింగపూర్‌లో నడుస్తూ కనిపించారు అని చేస్తున్న వాదనకి మద్దతు వచ్చేలా ఎడిట్ చేశారు. 

చివరగా, ఒక ఎడిట్ చేసిన ఫోటోని షేర్ చేస్తూ, చంద్రబాబు నాయుడు ఇటీవల సింగపూర్‌లో కనిపించారు అని తప్పుగా షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll