కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన తాజా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతు ఉద్యమంలో నకిలీ సిక్కు అని చెప్తూ, ఒక వ్యక్తి తలపాగా పెట్టుకుని నమాజ్ చేస్తున్నట్టు కనిపిస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఫోటోలో నమాజ్ చేస్తున్నది తాజా రైతు ఉద్యమంలో పాల్గొన్న నకిలీ సిక్కు.
ఫాక్ట్: పోస్ట్ లోని ఫోటో చాలా పాతది. కనీసం జనవరి 2016 నుండి ఇంటర్నెట్ లో షేర్ చేయబడుతుంది. ఆ ఫోటో తాజా రైతు ఉద్యమం కి సంబంధించింది కాదు.కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటోని ఒకరు 2016 లోనే ‘సిఖ్ అవేర్నెస్’ అనే వెబ్సైటులో పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ ఫోటోని ఒకరు ఫేస్బుక్ లో పోస్ట్ చేసినట్టు ఆ వెబ్సైటులోని ఫోటోలో చూడవొచ్చు.
ఫేస్బుక్ లో కీ-వర్డ్స్ తో వెతకగా, జనవరి 2016 లో చాలా మంది ఆ ఫోటోని ఫేస్బుక్ లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. కాబట్టి, పోస్ట్ లోని ఫోటో తాజా రైతు ఉద్యమం కి సంబంధించింది కాదు. ఫోటో లోని వ్యక్తికి సంబంధించి ఎటువంటి సమాచారం దొరకలేదు.
చివరగా, కనీసం ఐదేళ్ళ పాత ఫోటోని పెట్టి, తాజా రైతు ఉద్యమంలో పాల్గొన్న నకిలీ సిక్కు అని తప్పుగా షేర్ చేస్తున్నారు.