Fake News, Telugu
 

పాత ఫోటోని GHMC ఎన్నికల నేపధ్యంలో స్మ్రితి ఇరానీని ఓవైసీ రహస్యంగా కలిసాడని ప్రచారం చేస్తున్నారు

0

GHMC ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ కి వచ్చిన కేంద్ర మంత్రి స్మ్రితి ఇరానీని రహస్యంగా కలిసిన ఓవైసీ అని చెప్తూ, దీనికి సంబంధించిన ఫోటో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: GHMC ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ కి వచ్చిన కేంద్ర మంత్రి స్మ్రితి ఇరానీని రహస్యంగా కలిసిన ఓవైసీ.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటో 2016 లో ఢిల్లీలో జరిగిన పవర్లూం ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ లో స్మ్రితి ఇరానీ మరియు ఓవైసీ పాల్గొన్నప్పుడు తీసింది. ఈ మీటింగ్ కి సంబంధించి కొన్ని ఫోటోలు ఓవైసీ తన ట్విట్టర్ ఎకౌంటులో షేర్ చేసాడు, ఈ ఫోటోలో ఓవైసీ మరియు స్మ్రితి ఇరానీ పోస్టులో ఉన్న ఫోటోలో కనిపించే దుస్తుల్లో ఉండటం గమనించొచ్చు. దీన్నిబట్టి ఈ ఫోటో ఇటీవల GHMC ఎన్నికల ప్రచారం సందర్భంగా స్మ్రితి ఇరానీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఒవైసీ ఆమెని కలిసినప్పుడు తీసిన ఫోటో కాదని కచ్చితంగా చెప్పొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ ఫోటో గురించి మరింత సమాచారం కోసం వెతకగా ఈ ఫోటోని ఒక ట్విట్టర్ యూసర్ 2016 ఓవైసీని ట్యాగ్ చేస్తూ చేసిన ట్వీట్ మాకు కనిపించింది. ఓవైసీ ఒక పక్క BJPని విమర్శిస్తూ మరోవైపు BJP నేతలతో తిరుగుతున్నాడు అన్న వాదనతో ఈ ఫోటోలను షేర్ చేసాడు, ఐతే దీనికి సమాధానమిస్తూ ఓవైసీ ఈ ఫోటో పవర్ లూమ్స్ కి సంబంధించి జరిగిన మీటింగ్ సంధర్బంలో తీసినట్టు అర్ధం వచ్చేటు ట్వీట్ చేసాడు.

ఓవైసీ ఈ మీటింగ్ కి సంబంధించి మరికొన్ని ఫోటోలు తన ట్విట్టర్ ఎకౌంటులో షేర్ చేసాడు, వీటిలో ఓవైసీ మరియు స్మ్రితి ఇరానీ పోస్టులో ఉన్న ఫోటోలో కనిపించే దుస్తుల్లో ఉండటం గమనించొచ్చు. ఈ ఫోటోలో 22 ఆగస్ట్ 2016న ఢిల్లీలో జరిగిన పవర్లూంకి సంబంధించిన మీటింగ్ అని స్పష్టంగా రాసి ఉండటం గమనించొచ్చు. దీన్ని బట్టి ఈ ఫోటో ఇటీవల GHMC ఎన్నికల ప్రచారం సందర్భంగా స్మ్రితి ఇరానీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఓవైసీ ఆమెని కలిసినప్పుడు తీసిన ఫోటో కాదని కచ్చితంగా చెప్పొచ్చు.

ఇంకా 2016లో జరిగిన మీటింగ్ కి సంబంధించి సమాచారం కోసం గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఈ మీటింగ్ కి సంబంధించి కొన్ని వార్తా కథనాలు లభించాయి, వీటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

01 డిసెంబర్ 2020న జరగనున్న GHMC ఎన్నికల నేపధ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

చివరగా, ఈ ఫోటో 2016లో పవర్లూం ఇండస్ట్రీకి సంబంధించి జరిగిన మీటింగ్ లో ఓవైసీ స్మ్రితి ఇరానీని కలిసినప్పటిది.

Share.

About Author

Comments are closed.

scroll