Fake News, Telugu
 

ఈ రెండు వీడియోలు ఒలింపిక్స్‌లో ముగింపు వేడుకలకు సంబంధించినవి కావు

0

రెండు వీడియోలతో ఉన్న ఒక పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలు ఇటీవల ముగిసిన 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ముగింపు వేడుకలకు సంబంధించినవి అని పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఒలింపిక్స్‌లో ముగింపు వేడుకలకు సంబంధించిన వీడియోలు.

ఫాక్ట్: పోస్టులోని రెండు వీడియోలు ఇటీవల ముగిసిన 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ముగింపు వేడుకలకు సంబంధించినవి కావు. మొదటి వీడియో నిప్పన్ స్పోర్ట్స్ సైన్స్ విశ్వవిద్యాలయంలో జపనీస్ విద్యార్థి బృందం 2013లో చేసిన ప్రదర్శనది. వారు చేసిన విన్యాసాన్ని జపాన్‌లో “షూడంకోడో” లేదా “కలెక్టివ్ యాక్షన్” అని పిలుస్తారు. రెండొవ వీడియో 23 జూలై 2021న జరిగిన టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో తీసినది. టోక్యో ఒలింపిక్స్ యొక్క ముగింపు వేడుకలు 08 ఆగష్టు 2021న జరిగాయి. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

వీడియో 1:

మొదటి వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే విజువల్స్‌తో ఉన్న ఒక యూట్యూబ్‌ వీడియో లభించింది. యూరో న్యూస్ వారు ఈ వీడియోను 15 నవంబర్ 2013న అప్లోడ్ చేసినట్టు తెలుస్తుంది. నిప్పన్ స్పోర్ట్స్ సైన్స్ విశ్వవిద్యాలయంలో జపనీస్ విద్యార్థి బృందం వారి విశ్వవిద్యాలయ ఉత్సవాల్లో ఈ వీడియోను చేసినట్టు తెలుస్తుంది. దీనిని జపాన్‌లో “షూడంకోడో” లేదా “కలెక్టివ్ యాక్షన్” అని పిలుస్తారు.

జపాన్‌లో “షూడంకోడో” అని కీ వర్డ్స్ వాడి గూగుల్లో వెతకగా 12:37 నిమిషాల నిడివిగల యూట్యూబ్‌ వీడియో లభించింది. 4:31 నిమిషాల దగ్గర నుంచి యూట్యూబ్‌ వీడియోను క్లిప్ చేసి పోస్టులో 6:08 నిమిషాల వీడియోను ఆడ్ చేసినట్టు చూడొచ్చు. నిప్పన్ స్పోర్ట్స్ సైన్స్ విశ్వవిద్యాలయంలో జపనీస్ విద్యార్థి బృందం వారు ఈ వీడియో చేసినట్టు డిస్క్రిప్షన్ లో ఉంది. దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇక్కడ చూడొచ్చు.

కావున, ఈ వీడియో ఒలింపిక్స్‌లో ముగింపు వేడుకలకు సంబంధించిన వీడియో కాదు.

వీడియో 2:

ఈ వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే వీడియోతో ఉన్న ఒక ఆర్టికల్ లభించింది. 23 జులై 2021న ప్రచురించిన ఈ ఆర్టికల్‌లో టోక్యో ఒలింపిక్స్ యొక్క ప్రారంభ వేడుకల గురించి వివరించటం జరిగింది. 1,824 డ్రోన్‌లను ఉపయోగించి ప్రారంభ వేడుకలో ఇలా ప్రదర్శించినట్టు తెలిపారు. ఆర్టికల్‌లో ఉన్న ఒక ట్వీట్‌లో అదే వీడియో 23 జూలైలో పోస్ట్ చేసారు.

టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవం 23 జూలై 2021న టోక్యోలోని షింజుకు-కులోని నేషనల్ స్టేడియంలో జరిగింది. అసావో టోకోరో రూపొందించిన ఈ ఒలింపిక్స్ యొక్క చెక్కర్డ్ చిహ్నం, 1,824 డ్రోన్లను ఉపయోగించి నేషనల్ స్టేడియం పైన కనిపించింది, ఇది భూమి ఆకారంలోకి రూపాంతరం చెందింది. దీనికి సంబంధించి వీడియోలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. కావున, ఈ వీడియో ఒలింపిక్స్‌లో ముగింపు వేడుకలకు సంబంధించిన వీడియో కాదు, ప్రారంభోత్సవ వేడుకలకు సంబంధించింది.

టోక్యో ఒలింపిక్స్ యొక్క ముగింపు వేడుకలు 08 ఆగష్టు 2021న జరిగాయి. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. 2024 ఒలింపిక్స్ పారిస్‌లో జరుగుతాయి.

చివరగా, ఈ రెండు వీడియోలు ఇటీవల ముగిసిన 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ముగింపు వేడుకలకు సంబంధించినవి కావు.

Share.

About Author

Comments are closed.

scroll